దేవర టోటల్ లెక్క.. ఒక్కరోజులోనే మడతపెట్టిన పుష్ప 2!
హిందీ భాషలో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన మొదటి రోజే అక్కడ 'దేవర' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన బడా హీరోలు క్రేజ్ పక్కా రాష్ట్రాల్లో కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కంటెంట్ క్లిక్కయితే బాలీవుడ్ బడా హీరోల రికార్డులు కూడా బ్లాస్ట్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా బ్నార్త్ ఇండియన్ బెల్ట్‌లో ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్స్ సాధిస్తోంది.
హిందీ భాషలో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన మొదటి రోజే అక్కడ 'దేవర' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ఇది పుష్ప 2 సినిమాకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవడానికి ఇది మరో ఉదాహరణ. 'దేవర' సినిమా ఎన్టీఆర్‌కు మంచి విజయాన్ని అందించినప్పటికీ హిందీలో దాని లైఫ్ టైమ్ కలెక్షన్స్ 60 నుంచి 70 కోట్ల నెట్ మధ్య ఉండగా, పుష్ప 2 మాత్రం ఒక్క రోజులోనే ఆ సంఖ్యను దాటేసింది.
దేవర బిజినెస్ తో పోలిస్తే అది మంచి ప్రాఫిట్ ఇచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప 2 ఒక్కరోజులో ఆ రికార్డులను మించిపోవడం సినిమాకు ఉన్న మాస్ అట్రాక్షన్‌ను చూపిస్తుంది. ఫస్ట్ డే హిందీలో పుష్ప 2 ఏకంగా 72 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి 2, కెజీఎఫ్ 2 వంటి సీక్వెల్‌ల తరహాలోనే, పుష్ప 2 కూడా ప్రజలలోని అంచనాల్ని నెరవేరుస్తూ బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది.
కథానాయకుడైన అల్లు అర్జున్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించడంతో పాటు, దేశవ్యాప్తంగా అతని క్రేజ్‌ను మరింత పెంచుతోంది. మొదటి భాగం అందించిన విజయంతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. పుష్ప 2 సినిమాను బాలీవుడ్‌లో ఇప్పుడు 'స్ట్రీ 2' వంటి భారీ విజయాల సరసన చేర్చడం ఖాయం. ఈ ఏడాది బాలీవుడ్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్న 'స్ట్రీ 2' 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
కానీ పుష్ప 2 ఆ రికార్డులను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనే కాదు, హిందీ బెల్ట్‌లోనూ మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించడంలో విజయవంతమవుతోంది. ఇది అల్లు అర్జున్‌ను బాలీవుడ్‌లో కొత్త కింగ్‌గా మార్చే అవకాశాలు మరింత పెంచుతోంది. 'దేవర' సాధించిన విజయాన్ని తీసుకొని చూడగలిగితే, అది కూడా మంచి లాభదాయక చిత్రం. కానీ పుష్ప 2 ఒక్కరోజులో ఆ రికార్డును అధిగమించడం ప్రేక్షకుల అంచనాలు, సినిమాపై వారి ఆసక్తిని స్పష్టంగా చూపిస్తుంది. మొత్తం మీద, పుష్ప 2 రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ప్రభంజనంలా సాగుతూ 400 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి నూతన రికార్డులను నెలకొల్పుతోంది. చూస్తుంటే వెయ్యి కోట్లు అందుకోవడానికి ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది.