కంగువాను చూసైనా మొదలెట్టు పుష్ప..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఐదు భాషలలో రిలీజ్ అయ్యే ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మేకర్స్, ఎగ్జిబిటర్లు అందరూ ‘పుష్ప 2’ పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.
ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో అతని మార్కెట్ ఏంటనేది తెలుస్తుంది. మరోవైపు కోలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీగా సూర్య ‘కంగువా’ సినిమా ప్రేక్షకుల ముందకి రాబోతోంది. నవంబర్ 14న రిలీజ్ కాబోయే ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘కంగువా’ ప్రమోషన్ యాక్టివిటీస్ చాలా జోరుగా సాగుతున్నాయి. హీరో సూర్య, డైరెక్టర్ శివ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలనే లక్ష్యం మేకర్స్ పెట్టుకున్నారు. అందుకే అన్ని భాషలలో కూడా స్ట్రాంగ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే అన్ని లాంగ్వేజ్ లలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ మూవీకి భారీ ఈవెంట్ నిర్వహించారు. దీంతో పోల్చుకుంటే ‘పుష్ప 2’ మూవీ ఇంకా పెద్దది. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేయాలి. అయితే సుకుమార్ ఇంకా ఈ మూవీ షూటింగ్ పైనే ఉన్నారు.
‘పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో సుకుమార్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అయితే ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్స్ మాత్రం కచ్చితంగా దగ్గరుండి చూసుకోవాలి. అల్లు అర్జున్ కూడా యాక్టివ్ గా ప్రమోషన్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 5 రాష్ట్రాలలో 5 మెగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలంటే ఇప్పటి నుంచే పబ్లిక్ లోకి బలంగా చొచ్చుకొని వెళ్ళాలి.
మరి ‘పుష్ప’ టీమ్ దీనిపై ఏ విధంగా కసరత్తు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టింది. ఆమె ఫేమ్ కూడా ‘పుష్ప 2’ కి కచ్చితంగా ప్లస్ అవుతుంది. అలాగే ఐటెం సాంగ్ తో శ్రీలీల ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది వేచి చూడాలి.