పుష్ప 2 అరుదైన రికార్డ్… అక్కడ హైయెస్ట్ ప్రీ సేల్
ఇండియన్ సినిమాలకి యూఎస్ లో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. యూఎస్ తర్వాత అరబిక్ కంట్రీస్ లో ఇండియన్ సినిమాలని ఎక్కువగా చూస్తారు.
‘పుష్ప 2’ మూవీ రికార్డుల వేట ఆగడం లేదు. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీగా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ‘పుష్ప 2’ మూవీ ప్రీసేల్స్ అద్భుతంగా ఉండటం విశేషం.
ఇండియన్ సినిమాలకి యూఎస్ లో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. యూఎస్ తర్వాత అరబిక్ కంట్రీస్ లో ఇండియన్ సినిమాలని ఎక్కువగా చూస్తారు. మన మేకర్స్ కూడా యూఎస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా సినిమాలకి 20 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారు. యూఎస్ లో ప్రీమియర్ షోలకి ముందస్తుగా ప్రీసేల్స్ మొదలెడతారు.
ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీసేల్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ప్రీసేల్ కలెక్షన్స్ లో మన సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కూడా అవుట్ ఆఫ్ ఇండియాలో ప్రీసేల్స్ ద్వారా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇప్పటికే యూఎస్ లో ఈ ప్రీసేల్ కలెక్షన్స్ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే అరబిక్ కంట్రీస్ లలో కూడా సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
ఈ రెండు కాకుండా ఓషియానియా దేశాలలో కూడా మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ‘బాహుబలి’ తర్వాత ఈ దేశాలలో మన తెలుగు సినిమాలని భారీ స్క్రీన్స్ లలో ప్రదర్శిస్తున్నారు. వీటికి ముందస్తుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఆ దేశాలపై మన మేకర్స్ ఫోకస్ చేస్తున్నారు.
ఓషియానియా దేశాలలో ‘పుష్ప 2’ మూవీ ప్రీసేల్స్ లో రికార్డ్ సృష్టించింది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు సమయం ఉండగానే 700K డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ‘పుష్ప 2’ మానియా ఇండియా, యూఎస్ లోనే కాకుండా ఓషియానియా దేశాలలో కూడా ఉందని అర్ధమవుతోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్పరాజ్ క్యారెక్టర్ తో చాలా షార్ట్స్ చేసాడు. ఈ కారణంగా ఆస్ట్రేలియా ప్రేక్షకులని కూడా ఈ మూవీ ఎట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు.