ఓవర్సీస్‌లో పుష్ప 2 హవా.. ఈ నెంబర్ అసలు ఊహించలేదుగా..
నార్త్ అమెరికాలో ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందడం విశేషం. అక్కడ సినిమాకి మంచి ఆదరణ లభించి భారీ వసూళ్లను రాబట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మరింత ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందడం విశేషం. అక్కడ సినిమాకి మంచి ఆదరణ లభించి భారీ వసూళ్లను రాబట్టింది. అమెరికాలో పుష్ప 2 హవా చూస్తుంటే అక్కడ ప్రేక్షకులు తెలుగు సినిమాలపై చూపిస్తున్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది.
సాలీడ్ వసూళ్లతో పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. సినిమాలో అల్లు అర్జున్ గెటప్, డైలాగ్స్, అలాగే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. ముఖ్యంగా పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ స్టార్‌గా కూడా గుర్తింపు పొందారు. ఈ హవా ఓవర్సీస్‌లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కనబడుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నార్త్ అమెరికాలో పుష్ప 2 సినిమా తొలి నాలుగు రోజుల్లో అంటే తొలి వీకెండ్ ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు 19.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.163 కోట్లు) వసూలు చేసింది.
సినిమా కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, అలాగే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్‌లో రప్పించిన ప్రధాన కారణాలు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయానికి మరింత ప్రభావం చూపించగా, సుకుమార్ సృజనాత్మకత ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. పుష్ప 2 తో ఓవర్సీస్‌లో తెలుగు సినిమా రేంజ్ మరో లెవెల్ కు వెళుతున్నట్లు స్పష్టమైంది. సాధారణంగా తెలుగు సినిమాలు ఓవర్సీస్ మార్కెట్‌లో వసూళ్ల పరంగా పరిమితంగా ఉంటాయి.
కానీ ఈ సినిమా అందించిన ఈ భారీ వసూళ్లు భవిష్యత్‌లో తెలుగు సినిమాలపై మరింత ఆశలు పెంచుతున్నాయి. సినిమా యూనిట్ ఈ విజయాన్ని ఉత్సాహంగా ఆస్వాదిస్తుండగా, పుష్ప 2 రాబోయే రోజుల్లో మరింత రికార్డులను తిరగరాయాలని ఆశిస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఇంకా కొనసాగుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా లాంగ్ రన్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా ఆ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.