పుష్ప 2 ప్రీమియర్ సేల్స్… దేవరని బీట్ చేయలేదా?
వీటికి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 సౌండ్ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత రీసౌండ్ మరింత ఏక్కువైందని ట్రేడ్ పండితులు అంటున్నారు. సుకుమార్ చేసిన మ్యాజిక్ కి మొదటి రోజే అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం అని అనుకుంటున్నారు. యూఎస్ లో కూడా అత్యధిక స్క్రీన్స్ లో ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. వీటికి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి.
కచ్చితంగా యూఎస్ లో ప్రీమియర్ షోల ప్రీసేల్స్ తో ‘పుష్ప 2’ రికార్డులు సృష్టిస్తుందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే దానికి విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ మూవీ ప్రీ సేల్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ కంటే తక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే 1000 కోట్ల కలెక్షన్స్ మూవీ ‘కల్కి 2898ఏడీ’ కంటే ప్రీమియర్ షోల ప్రీసేల్స్ ఎక్కువగానే ఉండటం విశేషం.
రిలీజ్ కి రెండు వారాలు ముందు ‘దేవర’ సినిమా యూఎస్ ప్రీమియర్ షో ప్రీసేల్స్ ద్వారా $1,040,292 డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే పుష్ప 2కి మాత్రం ఇప్పటి వరకు $1,021,736 డాలర్స్ మాత్రమే వచ్చాయి. కానీ ‘దేవర’, ‘పుష్ప 2’ ప్రీ సేల్స్ కలెక్షన్స్ పరంగా మరీ పెద్ద వేరియేషన్స్ లేవు. ‘పుష్ప 2’ కొంత మార్జిన్ లో వెనుకబడి ఉంది. అయితే ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ కంటే ‘పుష్ప 2’ సేల్స్ బాగున్నాయని చెప్పాలి.
‘కల్కి’ మూవీ రిలీజ్ కి రెండు వారాల ముందు కేవలం $875K డాలర్స్ మాత్రమే వసూళ్లు అయ్యాయి. నిజానికి ‘పుష్ప 2’ పైన ఉన్న క్రేజ్ చూస్తే భారీ ప్రీసేల్స్ జరగడం గ్యారెంటీ అని భావించారు. అయితే యూఎస్ లో ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ‘దేవర’ కంటే ఎక్కువ థియేటర్స్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అయిన కూడా బుకింగ్స్ లో మాత్రం పెద్దగా జోరు కనిపించడం లేదు.
రిలీజ్ కి ముందు ఏమైనా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ‘పుష్ప 2’ మొదటి రోజు 200+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే యూఎస్ లో కూడా 5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రీసేల్ ట్రెండ్ లో మాత్రం అంత ఊపు లేదనే మాట వినిపిస్తోంది. మరి సినిమా రిలీజ్ అనంతరం కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.