'పుష్ప 2' టికెట్‌కి రూ.3000.. ఎక్కడో కాదు ఇండియాలోనే!
సోషల్ మీడియాలోనూ పుష్ప 2 క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయిన విషయం తెల్సిందే. ఇప్పుడు ముంబైలో సినిమా టికెట్ల రేట్లు షాకింగ్‌గా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా పుష్ప 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో గత వారం పది రోజులుగా చూస్తూనే ఉన్నాం. సాధారణంగా సౌత్ సినిమాలను, సౌత్ స్టార్స్‌ను పెద్దగా పట్టించుకోని నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్‌ను చూస్తే అర్థం అవుతోంది. ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌కి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ అడుగు పెట్టినా అల్లు అర్జున్‌కి పుష్పరాజ్‌గా స్వాగతిస్తూ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ పుష్ప 2 క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయిన విషయం తెల్సిందే. ఇప్పుడు ముంబైలో సినిమా టికెట్ల రేట్లు షాకింగ్‌గా ఉన్నాయి.
నైజాం ఏరియాలో ముందు రోజు ప్రీమియర్ టికెట్ల రేట్లు భారీ మొత్తంలో పెంచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది. రూ.1000 నుంచి రూ.1500ల వరకు ప్రీమియర్ షో టికెట్ల రేట్లు ఉన్నాయి. ఇదే భారీ మొత్తం అనుకుంటే ఏకంగా రూ.3000లకు పుష్ప 2 టికెట్లను అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని మైసన్ PVR జియో వరల్డ్ డ్రైవ్‌లో మొదటి రోజు కొన్ని షోలకు సంబంధించిన టికెట్ల రేట్లు భారీ మొత్తంలో ఉన్నాయి. ముఖ్యంగా నైట్ టైమ్‌లోని టికెట్ల రేట్లు ఏకంగా రూ.3000లుగా ఉన్నాయి. బుక్ మై షో లో ఈ విషయం క్లీయర్‌గా అర్థం అవుతోంది.
ఈ స్థాయిలో టికెట్ల రేట్లు ఉంటే హిందీలో పుష్ప 2 సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకోవడంతో పాటు లాంగ్ రన్‌లోనూ సినిమా వసూళ్లతో కుమ్మేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మైసన్ PVR జియో వరల్డ్ డ్రైవ్‌లోని ఇతర స్క్రీన్స్‌లో రూ.600ల నుంచి మొదలుకుని రూ.1500లు కూడా ఉంది. కొన్ని ప్రత్యేక స్క్రీన్స్, షోలకు మాత్రం రూ.3000 టికెట్ల రేట్లను ఖరారు చేయడం, ఇప్పటికే ఆ టికెట్లు సైతం కొన్ని అమ్మడు పోవడం జరిగిందట. మొత్తానికి పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు దారుణంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నైజాం ఏరియాలో మొదటి వారం రోజులు సినిమాను మధ్యతరగతి వారు చూసే పరిస్థితి లేదు. ఫ్యాన్స్ జేబుకు చిల్లు పెట్టడం తప్ప మరేం లేదు అంటూ చాలా మంది పుష్ప 2 టికెట్ల రేట్లపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ రికార్డ్ స్థాయి హైక్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ అక్కడ భారీగా టికెట్ల రేట్లను పెంచితే మాత్రం కచ్చితంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్‌తోనే వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయని తెలుస్తోంది. విడుదల సమయంకు అడ్వాన్స్ బుకింగ్ మరింత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 మొదటి రోజు వసూళ్లు రూ.350 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఉంటుంది అనే అంచనాతో మేకర్స్ ఉన్నారు. అల్లు అర్జున్, రష్మికల తాజా పాట సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.