కుమార్తె పేరు మీద హీరో అన్నదానం!
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు ఓ కుమార్తె జన్మించింది.
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు ఓ కుమార్తె జన్మించింది. ఆ పాపకు లీలా దేవి అని పేరు పెట్టారు. తాజాగా శర్వానంద్ కుమార్తె పేరు మీద అన్నదానం చేసారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అన్నదానం అన్నది ఎంతో గొప్ప కార్యం.
అలాంటి కార్యాన్ని ఇలా హీరో నిర్వహించడం అన్నది చాలా అరుదు. సాధారణంగా హీరోలంతా దేవాలయాలకు, అనాధ శరణాలయాలకు విరాళాలు ఇచ్చి తమ పనుల్లో నిమగ్నమవుతారు. వాళ్ల పేరిట ఆయా సంస్థలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. నేరుగా హాజరయ్యే అవకాశం, సమయం హీరోలకు ఉండదు కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ కార్యం దగ్గరుండి చూసుకుంటారు.
కానీ శర్వానంద్ మాత్రం తన బిజీ షెడ్యూల్ అంతటిని పక్కనబెట్టి స్వయంగా తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుని..అనాధలకు తానే స్వయంగా వడ్డించడం అన్నది ఎంతో గొప్ప కార్యం. ఇక శర్వానంద్ హీరోగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన 36 వచిత్రం, 37వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. శర్వానంద్ కి సక్సెస్ కి పడి చాలా కాలమవుతోంది.
`మహానుభావుడు` తర్వాత సరైన విజయం దక్కలేదు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చేసినా కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కానీ అంచనాలు అందుకోలేదు. శర్వానంద్ గత ఏడాది రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.