ఎస్ఎస్ఎంబీ29 లో కాశీ బ్యాక్ డ్రాప్!

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే.;

Update: 2025-03-11 16:30 GMT

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. పాన్ వ‌రల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 29వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొన‌గా అందులో మ‌హేష్ కు సంబంధించిన ఓ వీడియో రీసెంట్ గా లీక‌వ‌డంతో చిత్ర యూనిట్ సెక్యూరిటీని మ‌రింత పెంచింది. సెట్స్ లోకి ఒక్క ఫోన్ కూడా అనుమతించ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి లీకులుండేవి కానీ మ‌రీ సినిమా స్టార్టింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే మాత్రం లీకుల‌వ‌లేదు.

సినిమాను ఎలాగైనా సంవ‌త్స‌రంన్న‌ర లో పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న టార్గెట్ పెట్టుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎలాగూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కు బాగా టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి షూటింగ్ ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడట రాజ‌మౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

సినిమాలో మ‌హేష్ పాత్ర క‌థలో భాగంగానే న‌డ‌వ‌నుంద‌ని, అత‌ని పాత్ర కాశీ నుంచి మొద‌లై ఆ త‌ర్వాత అడ‌వుల‌కు వెళ్తుందంటున్నారు. అందుకే హైద‌రాబాద్ లో స్పెష‌ల్ గా మ‌ణిక‌ర్ణిక ఘాట్ ను సెట్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఆ సెట్ వ‌ర్క్ కూడా పూర్తైన‌ట్టు స‌మాచారం. మ‌హేష్ అడ‌వుల‌కు వెళ్ల‌డానికి గ‌ల కార‌ణం కూడా కాశీతోనే ముడిపడి ఉంటుంద‌ని టాక్.

రామాయ‌ణంలో ఆంజ‌నేయుడి పాత్ర స్పూర్తితో రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ క‌థ‌ను రాసుకున్నార‌ని, అస‌లు మ‌హేష్ అడ‌వుల‌కు ఎందుకు వెళ్లాడ‌నే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని లీకులందుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగులో మ‌హేష్ బాబు తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. వ‌చ్చే నెల‌లో ప్రెస్ మీట్ పెట్టి రాజ‌మౌళి ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశ‌ముందంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే ఛాన్సుంది. ఆస్కార్ విజేత కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయ‌ణ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News