పుష్ప-2.. అక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదా?
అయితే తెలుగు రాష్ట్రాల్లోని సీడెడ్ లో కూడా పుష్ప సీక్వెల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిగా చేసుకోగా.. ఇంకా ఆంధ్రా, నైజాంలో రీచ్ అవ్వలేదని తెలుస్తోంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆ సినిమా.. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.
బాక్సాఫీస్ వద్ద రూ.1400 కోట్లకు పైగా రాబట్టి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది పుష్ప-2. అయితే నార్త్ లో వేరే లెవెల్ లో సత్తా చాటుతోంది. భారీ వసూళ్లను సాధిస్తోంది. నార్త్ బెల్ట్ లో కనీవినీ ఎరుగని రీతిలో సత్తా చాటుతోంది. హిందీలో ఓ ఇండియన్ మూవీ అంతటి స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే ఫస్ట్ టైమ్ అంట!
హైయెస్ట్ గ్రాస్ సాధించిన ఇండియన్ చిత్రాల లిస్ట్ లో దంగల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ.. దానికి చైనా నుంచి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. టాప్-2లో ఉన్న బాహుబలి-2కు అన్ని భాషల్లో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న పుష్ప-2.. నార్త్ లో ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయిందట.
అయితే తెలుగు రాష్ట్రాల్లోని సీడెడ్ లో కూడా పుష్ప సీక్వెల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిగా చేసుకోగా.. ఇంకా ఆంధ్రా, నైజాంలో రీచ్ అవ్వలేదని తెలుస్తోంది. అతి త్వరలో రీచ్ అవ్వనుందని చెబుతున్నారు. సంక్రాంతి వరకు సినిమాను ఆడించాలని అనుకున్నట్లు సమాచారం. టికెట్ ధరలు తగ్గించిన విషయం కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు.
మరోవైపు.. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 13 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసిన పుష్ప-2 ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే $15 మిలియన్ మార్కును టచ్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అమెరికాలో పుష్ప-2 టార్గెట్ 15 మిలియన్ డాలర్స్ అన్న విషయం తెలిసిందే.
క్రిస్మస్ కు పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. వాటితో ఎలాంటి సంబంధం లేకుండా పుష్ప-2 టార్గెట్ ను రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ $15.3 మిలియన్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెస్తుందని చెబుతున్నారు. మరి నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును ఎప్పుడు బ్రేక్ చేస్తుందో.. మూడు చోట్ల బ్రేక్ ఈవెన్ ను ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో వేచి చూడాలి.