యూఎస్: కల్కి లెక్కను టచ్ చేయలేకపోయిన పుష్పరాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-12-06 08:41 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ముందుగానే మాంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక అమెరికాలో కూడా గట్టిగానే విడుదల చేశారు. ఇక బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఫైనల్ గా చూసుకుంటే మాత్రం అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాయి.

ప్రత్యేకించి, కల్కి 2898 ఏడీ మూవీ డే 1 కలెక్షన్లను అధిగమించాలని భావించినా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాలేదు. అమెరికాలో ప్రీమియర్ షోలు, డే 1 కలెక్షన్ల లెక్క ఇంకా పూర్తిగా తేల్చకపోయినప్పటికీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తే తెలుగు వెర్షన్ కలెక్షన్లు కల్కి చిత్రానికి తక్కువగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. మొదటి రోజున పుష్ప 2 తెలుగు వెర్షన్ సుమారు $800k వసూలు చేయగలదని అంచనా.

అదే సమయంలో హిందీ వెర్షన్ $250k పైగా వసూలు చేస్తూ, మొత్తం మొదటి రోజు గ్రాస్ $1.1 మిలియన్‌ను చేరుకుంది. ఇదే సమయంలో, కల్కి 2898 ఏడీ తెలుగు వెర్షన్ మొదటి రోజునే $1.35 మిలియన్ గ్రాస్‌ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కల్కితో పోలిస్తే పుష్ప 2 కలెక్షన్లు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే, పుష్ప 2కు హిందీ వెర్షన్ నుంచి వచ్చిన ఆదరణ విశేషం.

ఉత్తరాదిలోనే కాకుండా అమెరికాలో కూడా హిందీ వెర్షన్‌కు మంచి స్పందన లభించింది. మొత్తంగా పుష్ప 2 తొలి రోజు ప్రీమియర్ షోలు, డే 1 కలిపి సుమారు $3.7 నుంచి $4 మిలియన్ వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇదే సమయంలో కల్కి 2898 ఏడీ మొత్తం $5.5 మిలియన్ డే 1 కలెక్షన్లతో టాప్ లిస్టులో ఉంది. పుష్ప 2కు హిందీ వెర్షన్ బలంగా నిలిచినా, తెలుగు వెర్షన్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం షాకింగ్ అనే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై అమెరికాలో భారీ హైప్ ఉన్నా, ప్రేక్షకుల ఆదరణ పూర్తిగా పొందడంలో పుష్ప 2 మాత్రం కొంత వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత మెరుగుపడతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హిందీ మార్కెట్ పుష్ప 2కు మద్దతుగా నిలుస్తోంది, అలాగే తెలుగు వెర్షన్‌లో ఆడియన్స్ రిస్పాన్స్ మెరుగుపడితే, భవిష్యత్తులో మంచి కలెక్షన్లు సాధించడం సాధ్యమే.

Tags:    

Similar News