పుష్ప-2.. బన్నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Update: 2024-12-14 11:03 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది. ఊహించినట్లే భారీ వసూళ్లను కురిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ లో కూడా పుష్ప-2 అదరగొడుతోంది. అనేక రికార్డులు బద్దలకొడుతోంది. భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఓవర్సీస్ లో అయితే చెప్పనక్కర్లేదు. నార్త్ అమెరికాలో రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. 10 మిలియన్ డాలర్స్ మార్క్ ను టచ్ చేసి దూసుకుపోతోంది. ఓవరాల్ గా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

అయితే పుష్ప సీక్వెల్ రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్.. హిట్ అయ్యాక కూడా వేరే లెవెల్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో నిర్వహించాలని అనుకున్నారట. అందులో భాగంగా అల్లు అర్జున్.. రీసెంట్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. మూవీని హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేయగా ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు గానూ బన్నీని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

అనంతరం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్నారు బన్నీ. మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఓకే అయినా.. పుష్ప-2 పోస్ట్ ప్రమోషన్స్ సంగతేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బన్నీకి బెయిల్ వచ్చినా.. ఇంకా కేసు ముగియలేదు.

అదే సమయంలో పుష్ప-2 పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు నగరాలతోపాటు హైదరాబాద్ లో మేకర్స్ ఈవెంట్స్ ను ఫిక్స్ చేశారు. అది అయ్యాక బన్నీ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్దామనే ప్లాన్ లో ఉన్నారట. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నారని వినికిడి. కాబట్టి అల్లు అర్జున్ ప్లాన్స్ కు ఇప్పుడు చిన్న బ్రేక్ పడినట్లేనని నెటిజన్లు చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News