ఆ విషయంలో కల్కి కి తగ్గకుండా 'పుష్ప 2'..!

అందుకే పుష్ప 2 ను ఆ స్థాయిలో రూపొందించాలనే పట్టుదలతో దర్శకుడు సుకుమార్‌ ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయడం జరిగింది

Update: 2024-07-01 05:25 GMT

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా వచ్చి రెండు ఏళ్లు దాటింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా సాధించిన హిట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం పుష్ప గురించి తెలిసింది.

అందుకే పుష్ప 2 ను ఆ స్థాయిలో రూపొందించాలనే పట్టుదలతో దర్శకుడు సుకుమార్‌ ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయడం జరిగింది. షూటింగ్ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం తీసుకుని మెల్లగా, ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్నాడు.

ఆగస్టు లో సినిమా విడుదల చేసే పరిస్థితి లేదని, డిసెంబర్‌ లో వస్తాం అంటూ ఇప్పటికే పుష్ప టీం నుంచి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్న దర్శకుడు ఆ తర్వాత షెడ్యూల్‌ ను తెలుగు రాష్ట్రాల అవతల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా 50 రోజులకు పైగానే సినిమా షూటింగ్‌ చేయాల్సి ఉందట. సెప్టెంబర్‌ లో సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బిజినెస్ విషయమై దృష్టి పెట్టారు.

పుష్ప 2 పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఖర్చు పెడుతున్నారట. పుష్ప కి పెట్టిన ఖర్చు తో పోల్చితే చాలా రెట్లు ఎక్కువ అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు చేయాల్సి ఉందని భావిస్తున్నారు.

విడుదలకు సమయం ఉంది, సినిమా క్రేజ్ ఇంకా పెరుగుతుంది. కనుక వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది కష్టం కాకపోవచ్చు అని మైత్రి మూవీ మేకర్స్ వారు భావిస్తున్నారట. ఇప్పటికే భారీ మొత్తానికి ఓటీటీ డీల్‌ సెట్‌ చేసిన పుష్ప ముందు ముందు మరిన్ని భారీ డీల్ ని చేసుకుంటే వెయ్యి కోట్లు పెద్ద కష్టం కాకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవల కాలంలో వచ్చిన కల్కి సినిమా రికార్డ్‌ స్థాయి లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పుష్ప 2 సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో కల్కి కి ఏమాత్రం తగ్గకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని, వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News