పుష్ప 2 వాయిదా.. అల్లు వారికి మంచి శకునమే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ మూవీ చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ మూవీ చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ 300+ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమా 50 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందంట. ఈ కారణంగానే ఆగష్టు 15న అనుకున్న రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. డిసెంబర్ 6న పుష్ప ది రూల్ థియేటర్స్ లోకి వస్తుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
రిలీజ్ డేట్ వాయిదా పడటంతో సుకుమార్ మరింత పెర్ఫెక్ట్ గా అవుట్ ఫుట్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ ఆలస్యంపై ఐకాన్ స్టార్ అభిమానులు ఒకింత అసంతృప్తికి గురవుతున్నారు. పుష్ప 2 థియేటర్స్ లో చూడాలంటే డిసెంబర్ 6 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే పాలిటిక్స్ వలన కూడా ఈ సినిమాపై ఎన్నడూ లేనంత నెగిటివ్ క్యాంపైన్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఆలస్యంగా రిలీజ్ అవడం వలన ఆ నెగిటివ్ క్యాంపైన్ కూడా తగ్గే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటికే థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అమీర్ పేటలో సత్యం థియేటర్ ని అల్లు అర్జున్ కొనుగోలు చేసి మల్టీప్లెక్స్ గా మార్చేశారు. ప్రస్తుతం సత్యం థియేటర్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్తపేటలో అల్లు అర్జున్ అల్లు స్టూడియోని కూడా కట్టారు. ఇందులో షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ అల్లు స్టూడియోలో బన్నీ ఒక థియేటర్ ని కూడా నిర్మిస్తున్నారు. ఆ డాల్బీ సినిమా థియేటర్స్ ప్రస్తుతం కన్ స్ట్రక్షన్ దశలో ఉంది.
పుష్ప ది రూల్ సినిమాని ఈ థియేటర్ లో ఫస్ట్ మూవీగా రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఆ సమయానికి థియేటర్ నిర్మాణం కూడా మొత్తం కంప్లీట్ అవుతుందట. అందుకే ఫస్ట్ సినిమాగా పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే పుష్ప2 చిత్రం నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. రష్మికపై చిత్రీకరించిన సాంగ్ అయితే షార్ట్స్ ద్వారా ట్రెండ్ అవుతోంది. ఫాహద్ ఫాజిల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటించాడు. పుష్ప 2కి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే సుకుమార్ ప్రకటించాడు.