పుష్ప 2.. శ్రీవల్లి టైమొచ్చింది!

ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో "పుష్ప 2" ఒకటి

Update: 2024-05-22 11:16 GMT

ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో "పుష్ప 2" ఒకటి. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, మొదటి భాగం "పుష్ప: ది రైజ్" సాధించిన విజయం తరువాత మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది.

సుకుమార్ టీమ్ అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేసేందుకు కృషి చేస్తోంది. "పుష్ప 2" పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ డేట్ కోసం చిత్రబృందం పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేందుకు "పుష్ప 2" టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఇప్పుడు మరో పాటను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. మే 23న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సాంగ్ విడుదల కానుంది. రష్మిక, అల్లు అర్జున్ జంటగా ఉన్న ఈ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తంగా 5 పాటలు ఉండబోతున్నట్ల సమాచారం. ఇక సెకండ్ సాంగ్ లో పుష్ప శ్రీవల్లి కెమిస్ట్రీ మరింత హైలెట్ అయ్యే విధంగా ఉంటుందట.

పార్ట్ 1లో శ్రీవల్లి సాంగ్ కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఇక ఇప్పుడు అంతకుమించి ఉండేలా దేవి కంపోజింగ్ ఉండబోతున్నట్లు సమాచారం. సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అల్లు అర్జున్ తో ఈ కాంబో పడితే మ్యూజిక్ విషయంలో అస్సలు తేడా రాదు. అంతేకాక, "పుష్ప 2" లో ఒక ఐటెమ్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. ఈ సాంగ్ కోసం పలు ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎవరిని తీసుకుంటారో స్పష్టత త్వరలోనే రానుంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీ పడడం లేదు. మొదటి భాగం "పుష్ప: ది రైజ్" మంచి విజయాన్ని సాధించిన తరువాత, "పుష్ప 2" పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. "పుష్ప 2" పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. మరి అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News