'పుష్ప2' సంక్రాంతి సౌండ్

అలా ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.

Update: 2024-01-15 12:25 GMT

సంక్రాంతి వచ్చిందంటే సినీ లవర్స్ కి పండగే. స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతికే రిలీజ్ అవుతూ ఉంటాయి. మరోవైపు పండగ సందర్భంగా హీరోల కొత్త సినిమాలకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుంటాయి. ఈ అప్డేట్స్ తో సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారు అభిమానులు. అలా ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.


మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోవైపు పండగ సందర్భంగా మరికొందరు హీరోలు తమ సినిమాల అప్‌డేట్స్‌ తో సిద్ధమయ్యారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా క్రేజీ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మెగాస్టార్, ప్రభాస్, సూర్య, విజయ్‌, వరుణ్ తేజ్ లాంటి స్టార్‌ హీరోలు తమ మూవీ పోస్టర్స్‌తో అలరించారు.

ఇందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప2' నుంచి బన్నీ న్యూ లుక్ ని చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలా జరగలేదు. తాజాగా 'పుష్ప2' నుంచి మేకర్స్ ఓ డిఫరెంట్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్ ని గమనిస్తే.. మన భారతదేశ చిత్రపటంలో వివిధ రాష్ట్రాలు సూచించే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

అంటే 'పుష్ప2' ని ఎలా అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారో అదేవిధంగా పండగ శుభాకాంక్షలు కూడా పాన్ ఇండియా స్టైల్ లోనే చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పండగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇదే పోస్టర్లో రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు.

ఆగస్టు 15, 2024న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News