తొలివారం నుంచే పుష్పరాజ్ బరిలోకి!
`పుష్ప-2` షూటింగ్ మొదలైన నాటి నుంచి గ్యాప్ లేకుండా సుకుమార్ అండ్ టీమ్ నిరంతరం పనిచేస్తోన్న సంగతి తెలిసిందే.
`పుష్ప-2` షూటింగ్ మొదలైన నాటి నుంచి గ్యాప్ లేకుండా సుకుమార్ అండ్ టీమ్ నిరంతరం పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. షూట్ అంతా ఏపీ-తెలంగాణ ప్రాంతాల్లోనే ఉండటంతో టీమ్ అంతా ఇక్కడే ఉండి పనిచేస్తోంది.ఔట్ డోర్ షూట్ అంటూ లేదు. పాటలకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. కథాను గుణంగా పాటలు డిజైన్ చేసిన నేపథ్యంలో పాటల కోసం ప్రత్యేకంగా ఖర్చు అవసరం లేదు.
మొదటి భాగం షూటింగ్ ఎలా ముగించారో రెండవ భాగాన్ని అలాగే ముగించనున్నారు. నటీనటుల్లో బన్నీ మాత్రమే అవసరం మేర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆసమయంలోనే సుకుమార్ కూడా రెస్ట్ మోడ్ లోకి వెళ్తున్నారు. అవసరం అనుకుంటే? సెట్స్ కి వెళ్తున్నారు.ఇటీవలే బన్నీ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లి తిరిగొచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. దీంతో బన్నీ వచ్చే వారం నుంచి యధావిధిగా షూటింగ్లో పాల్గొంటాడని సమాచారం.
శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. దీనిలో బన్నీ లేని సన్నివేశాల్ని ఇతర కీలక నటీనుటులపై చిత్రీకరిస్తున్నారు. బన్నీ జాయిన్ అయిన నాటినుంచి పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 6న రిలీజ్ తేదీగా ప్రకటించిన నేపథ్యంలో సమయం కూడా ఎక్కువగానే ఉంది. అయితే షూటింగ్ తో సంబంధం లేకుండా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయి.
షూటింగ్ పూర్తయినంత వరకూ ఆ పనుల్నివెంట వెంటనే ముగిస్తున్నారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసమంటూ సుకుమార్ ప్రత్యేకంగా సమయం కేటాయించడం లేదు. తన టెక్నికల్ టీమ్ ఆపనుల్ని దగ్గరుండి చూసుకుంటుంది.అవసరం పడితే సుకుమార్ స్టూడియోకి వెళ్తున్నారు. అలాగే ఖాళీ సమయాల్లోనూ ఆ పనుల్లో ఉంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.