బన్నీ డెడికేషన్ అలా ఉంటుంది మరి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన పుష్ప-2 టీజర్ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే

Update: 2024-04-09 05:24 GMT

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన పుష్ప-2 టీజర్ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సోమవారం విడుదల చేశారు. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కావడంతో పుష్ప-2 టీజర్ భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ రికార్డులు సృష్టిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ నెట్టింట ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

అయితే టీజర్ లో మాతంగి (అమ్మవారి) వేషంలో అల్లు అర్జున్ అద్భుతంగా కనిపించారు. పుష్ప స్వాగ్, స్టైల్ అదిరిపోయింది. జాతర సీక్వెన్స్ కన్నుల పండువగా ఉంది. బన్నీ అమ్మవారి గెటప్, స్టైల్, ఓ యాక్షన్ స్టంట్ ను మేకర్స్ హైలైట్ చేశారు. ఈ జాతర సీక్వెన్స్ లో ఒక పాటతో పాటు మాస్ ఫైట్ ఉండనుందని సమాచారం. దీంతో బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ విశ్వరూపం చూడనున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పుడు ఈ టీజర్ గురించే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. కొందరు అదిరిపోయిందంటుంటే, మరికొందరు ఒక్క డైలాగ్ అయినా ఉంటే బాగున్ను అని అంటున్నారు. ఇంకొందరు విలన్ తో పాటు మూవీలోని రోల్స్ ను చూపించి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదని చెబుతున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఈ టీజర్ పెర్ఫెక్ట్ గా రావడానికి అల్లు అర్జున్ 51 టేక్స్ తీసుకున్నారట. ఈ విషయాన్ని పుష్ప-2 సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి తెలిపారు. జాతర సీక్వెన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఒక్క నిమిషానికి పైగా ఉన్న గ్లింప్స్ కోసం చాలా వర్క్ జరిగిందని వెల్లడించారు. అల్లు అర్జున్.. రోల్ అండ్ షూట్ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉంటారని పేర్కొన్నారు. పెర్ఫెక్ట్ గా షాట్స్ రావాలని కొన్ని సీన్లను అడిగి మరి బన్నీ రీషూట్ చేయించారని తెలిపారు.

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ మారగా.. బన్నీ డెడికేషన్ అంటే అలా ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏ విషయంలో కూడా అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్ అంచనాలు నెలకొన్న పుష్ప-2ను సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తుండగా.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News