లిక్క‌ర్ పొగాకు బ్రాండ్ల‌కు పుష్ప‌రాజ్ షాక్‌లు

ఇంతకు ముందు కొన్ని పెద్ద మద్యం బ్రాండ్‌లు బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్రదించగా వాటికి సంతకం చేయడానికి ప్రకటనలు చేయడానికి నిరాకరించాడు.

Update: 2023-12-15 03:47 GMT
లిక్క‌ర్ పొగాకు బ్రాండ్ల‌కు పుష్ప‌రాజ్ షాక్‌లు
  • whatsapp icon

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్.. చిరంజీవి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి స్టార్లు బ్రాండ్ల‌ను ఎంపిక చేయాలంటే ఆచితూచి అడుగులు వేస్తారు. ఒక ఉత్ప‌త్తికి తాము ప్ర‌చారం చేయ‌డం అంటే ప్ర‌జ‌ల‌ను ప్రేరేపించ‌డ‌మేన‌ని భావించి చెడు చేసే బ్రాండ్ల‌కు ఎప్పుడూ ప్ర‌చారానికి పూనుకోలేదు.

ఇప్పుడు అదే బాట‌ను అనుస‌రిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకు ముందు కొన్ని పెద్ద మద్యం బ్రాండ్‌లు బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్రదించగా వాటికి సంతకం చేయడానికి ప్రకటనలు చేయడానికి నిరాకరించాడు. చాలామంది స్టార్లు ఇలాంటి అవ‌కాశాల‌ను విడిచిపెట్ట‌రు. కానీ బ‌న్ని అందుకు పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు .. ప్ర‌ముఖ లిక్కర్ బ్రాండ్ - పాన్ బ్రాండ్ పుష్ప 2లో ఇన్ ఫిలిం బ్రాండింగ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. అంతేకాదు.. పుష్ప‌రాజ్ పాత్ర మందు తాగిన‌ప్పుడు ఆ గ్లాస్ పై లిక్క‌ర్ బ్రాండ్ పేరు ఉంటుంది. పొగతాగినా గుట్కా నమిలినా.. అదే బ్రాండ్‌ని బన్ని ప్ర‌మోట్ చేయాల‌నేది రూల్. ఈ త‌ర‌హా ఇన్‌ఫిలిం బ్రాండింగ్ కోసం ప్ర‌ముఖ కంపెనీలు బ‌న్నీకి దాదాపు రూ.10 కోట్లు ఆఫర్ చేశాయని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ దానిని తిరస్కరించినట్లు సమాచారం.

ఇలాంటి బ్రాండ్‌లను ప్రచారం చేయడం తన నైతికతకు విరుద్ధం. ప్రేక్షకులు అభిమానులను తప్పుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి అలాంటి ఒప్పందాలపై సంతకం చేయకూడ‌ద‌ని ఐకాన్ స్టార్ వారిని ఒప్పించిన‌ట్టు తెలిసింది. నిజానికి బ‌న్ని స్క్రీన్ పై పొగ తాగినా కానీ దానిని ప్రోత్సహించడు. నిర్దిష్ట బ్రాండ్‌లను ఉపయోగించడం ప్రేక్షకులను వాటిని ఉపయోగించమని ప్రేరేపించడం స‌బ‌బు కాద‌ని బ‌న్ని భావించార‌ట‌.

ఇటీవ‌ల షారూఖ్ - అజ‌య్ దేవ‌గ‌న్- అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఒక పాన్ మ‌సాలా ప్ర‌క‌ట‌న పెను దుమారానికి కార‌ణం కాగా, ఆ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తున్న స్టార్ల‌కు కోర్టులో మొట్టికాయ‌లు ప‌డ్డాయి. అయితే పాన్ మసాలా బ్రాండ్ ప్ర‌చారం చేసినందుకు అక్ష‌య్ సారీ చెప్పాడు. పాత ఒప్పందం కార‌ణంగా ఈ ప్ర‌క‌ట‌న‌ల‌ను తొల‌గించ‌లేమ‌ని కూడా అన్నారు.

Tags:    

Similar News