రిలీజ్ కు ముందే పుష్ప రికార్డ్.. టాప్-100లో గ్లోబల్ వైడ్ గా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప-2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

Update: 2024-06-05 14:07 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప-2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2 కోసం అంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నార్త్ టు సౌత్.. ఇప్పటికే కచ్చితంగా మూవీ చూడాలనిపించేలా బజ్ క్రియేట్ అయింది.

భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 రిలీజ్ చేస్తామని చాలా రోజులే క్రితమే మేకర్స్ ప్రకటించారు. ఆ మధ్య మూవీ పోస్ట్ పోన్ అవుద్దని వార్తలు వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లో అయినా అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తామని పలుమార్లు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోయినా.. ఆడియన్స్ కు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని సుకుమార్ కొన్ని సీన్లు రీ షూట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పుష్ప సాంగ్స్ ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప-2కు కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. కొన్ని రోజుల క్రితం పుష్ప పుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. రీసెంట్ గా సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ పాటను రిలీజ్ చేశారు.

ఈ పాటలో బన్నీ, రష్మిక తమ స్టెప్స్ తో అలరించారు. మెయిన్ గా కపుల్ స్టెప్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ సాంగ్ కు రీల్సే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో సూసేకి పాట.. సూపర్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 70 మిలియన్ వ్యూస్ కుపైగా సొంతం చేసుకుంది. దాదాపు 1.4 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మొత్తానికి పుష్ప ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నట్లే.

మరోవైపు, పుష్ప-2 రిలీజ్ కు ముందు అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. గ్లోబల్ వైడ్ గా ఈ మూవీలోని నాలుగు పాటలు టాప్-100 మ్యూజిక్ వీడియోస్ లో ట్రెండ్ అవుతున్నాయి. నాలుగు అంటే.. రెండు పాటలు రెండు భాషల్లో అని అర్థం. సూసేకి తెలుగు వెర్షన్ టాప్-2 లో ఉండగా.. హిందీ వెర్షన్ అంగారూన్ 8వ స్థానంలో ఉంది. పుష్ప పుష్ప పాట హిందీ వెర్షన్ టాప్-57లో ఉండగా.. తెలుగు వెర్షన్ 79వ ప్లేస్ లో ఉంది. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News