699కి 10 సినిమాలు: PVR INOX స్కీం ఫ‌లిస్తుందా?

భారతదేశంలోని ప్రముఖ సినిమా చైన్ అయిన PVR INOX లిమిటెడ్ PVR INOX పాస్‌పోర్ట్ ని విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించింది.

Update: 2023-10-15 04:51 GMT

భారతదేశంలోని ప్రముఖ సినిమా చైన్ అయిన PVR INOX లిమిటెడ్ PVR INOX పాస్‌పోర్ట్ ని విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. ఇది వినియోగదారులను క్రమం తప్పకుండా థియేటర్‌లలో సినిమాలు వీక్షించేలా ప్రోత్సహించే లక్ష్యంతో సబ్‌స్క్రిప్షన్ పాస్. ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్. ఈ స్కీమ్ లో ప్రేక్షకులు నెలవారీ రుసుముతో నెలకు గరిష్టంగా 10 సినిమాలను చూడవచ్చు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ అక్టోబర్ 16 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.699 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సబ్‌స్క్రిప్షన్ పాస్ సోమవారం నుండి గురువారం మధ్య పని చేస్తుంది. IMAX, గోల్డ్, LUXE .. డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం సర్వీస్‌లలో ఈ పాస్ పని చేయదు.

PVR INOX లిమిటెడ్ సహ-CEO గౌతమ్ దత్తా మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు సినిమాలు చూసే అలవాట్ల గురించి మరింత తెలుసుకోవడానికి కస్టమర్ బేస్‌తో కంపెనీ నిమగ్నమై ఉందని అన్నారు. మేము సినిమాకి రావడానికి ఇష్టపడతామని వినియోగదారులు అంటున్నారు. కానీ అన్నింటినీ చూడ‌లేక‌పోతున్నామని అసంతృప్తి వారిలో ఉంది. అయితే అకేష‌న‌ల్ గా చూసేవి.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆద‌రించే సినిమాలు ఏవి అనేది ప‌రిశీలిస్తూనే ఉంటాము. టీవీ, ఐప్యాడ్ మొబైల్‌లో సినిమాలు చూస్తున్నారు. వాటికి భిన్నంగా పెద్ద సినిమాల‌ను థియేట‌ర్ల‌లో చూస్తున్నారు. వారి మనస్సులో పఠాన్-జవాన్-సలార్-లియో ఇంకొన్ని పెద్ద సినిమా సినిమాలు. ఆపై వారు నిజంగా చూడాలనుకునే కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వాటి కోసం మరికొంత కాలం వేచి ఉండటం పర్వాలేదు అనుకుంటారు.. కాబట్టి మేము ప‌రిశీలించిన‌ప్పుడు ప్రతి వారం సినిమా హాల్‌కి ఎందుకు రాలేరు? అని ప్ర‌శ్నిస్తే.. ఇది ఖరీదైన వ్య‌వ‌హారం అని ప్రేక్ష‌కులు చెప్పారు అని విశ్లేషించారు. ఈవెంట్ సినిమాలు (భారీ కాస్టింగ్ తో) పెద్దవిగా మారుతున్నాయని, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. ప్రతి వారం అన్ని భాష‌లు క‌లుపుకుని 13-16 సినిమాలు విడుదలవుతున్నాయన్నారు. ఈ పథకం వినియోగదారులను తిరిగి థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంద‌ని విశ్లేషించారు.

తిండి కోలా ధ‌ర‌ల త‌గ్గింపు:

పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ ఇటీవల ఆహారం పానీయాల ధరలను 40 శాతం తగ్గించింది. ఇది సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9.. సాయంత్రం 6 గంటల మధ్య సహేతుకంగా కాంబో ధ‌ర‌లను రూ.99కి ప్రారంభించింది. ఈ చొరవ వల్ల మరిన్ని సినిమాలు చూసేందుకు ఎక్కువ మంది వస్తారని అన్నారు. కొన్నాళ్ల‌కు ఈ అల‌వాటు మ‌రింత ముదురుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ అలవాటును సృష్టిస్తారు. కాబట్టి ఇది నిజంగా ఒక మొమెంటం షిఫ్టర్. కేవలం ధర ప్రమోషన్ మాత్రమే కాదు అన్నారాయన. ఈ ఆఫర్‌తో కంపెనీ విద్యార్థులు, గృహిణులు సీనియర్ సిటిజన్‌లను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

స‌బ్ స్క్రిప్ష‌న్ ఎలా?

PVR INOX పాస్‌పోర్ట్ ని కనీసం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ వ్యవధితో కొనుగోలు చేయవచ్చు. దీన్ని యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రిడీమ్ చేసుకోవడానికి, వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవాలి. ఒక‌టికి మించి టిక్కెట్‌ల కోసం లావాదేవీ జరిగితే, ఒక టికెట్‌ను పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించి రీడీమ్ చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు, ఏదైనా ఇతర సాధారణ చెల్లింపు విధానం ద్వారా ఈ అవ‌కాశం ఉంది. `పాస్‌పోర్టు`ను ఉపయోగించి సినిమా చూడాలనుకునే వారు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇది కూడా వేరొక‌రికి బదిలీ చేయడం కుద‌ర‌దు.

ప‌థ‌కంలో లోటు పాట్లు

ప‌థ‌కం బాగానే ఉన్నా కానీ, ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి. నిజానికి సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కూ ఈ సినిమా పాస్ ప‌ని చేస్తుంది. అంటే ఉద్యోగులు క‌చ్ఛితంగా సెల‌వు పెట్టి సినిమాల‌కు వెళ్లాలి. లేదా రాత్రులు నిద్ర చెడ‌గొట్టుకుని నైట్ షోలు చూడాల్సి ఉంటుంది. అలాగే వారం వారం క్రేజ్ ఉన్న సినిమాలు ఎన్ని వ‌స్తున్నాయి? కేవ‌లం నెల‌రోజుల్లోనే 10 సినిమాలు చూసేయాలంటే కుదురుతుందా? ఆఫీస్ ప‌ని ఒత్తిళ్ల న‌డుమ వీకెండ్ల‌లో మాత్ర‌మే టైమ్ ఉండే వారికి ఈ త‌ర‌హా పాస్ వ‌ర్క‌వుట‌వ్వ‌దు. నెల‌కు 2-3 క్రేజ్ ఉన్న సినిమాలు మాత్ర‌మే విడుద‌ల‌వుతుంటాయి. అలాంట‌ప్పుడు చిన్న‌ సినిమాలు, అంత‌గా క్రేజ్ లేని వాటి కోసం జ‌నం థియేట‌ర్ల వైపు అడుగులు వేస్తారా? అన్న‌ది ఆలోచించాలి. ఇక స్నాక్స్ ధ‌ర‌లు తగ్గిస్తే జ‌నం థియేట‌ర్ల‌కు అల‌వాటు ప‌డ‌తార‌ని చెబుతున్నారు. ఇది ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో వేచి చూడాలి.

Tags:    

Similar News