క‌ల్కి ఎఫెక్టుతో PVR ఐనాక్స్ షేర్లకు రెక్క‌లు

సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడ్‌లో బిఎస్‌ఇలో పివిఆర్ ఐనాక్స్ షేరు 6 శాతం పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయి రూ.1,512.60ని తాకింది. బిజినెస్ రికవరీపై భారీ అంచనాల మధ్య ఈ ఫ‌లితం ఆస‌క్తిని క‌లిగించింది.

Update: 2024-07-01 17:14 GMT

ఒక సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి హుషారు ఉంటుందో ఇప్ప‌టికే చూశాం. `క‌ల్కి 2989ఎడి` చిత్రానికి ఆరంభ స‌మీక్ష‌లు పాజిటివ్ గా రావ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే 500కోట్ల క్ల‌బ్ లో చేరింది ఈ చిత్రం. ఒక సినిమా గురించి పాజిటివ్ బ‌జ్ న‌డిస్తే ఎలా ఉంటుందో క‌ల్కి ఫ‌లితం ఇటీవ‌ల‌ చూపిస్తోంది. ఒక సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడితే అందులో ప‌ని చేసిన వారికి అది ఎంతో పాజిటివ్ గా మారుతుంది. చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీని తెస్తుంది.

ఇప్పుడు ఇలాంటి ఒక పాజిటివ్ వేవ్ పీవీఆర్ ఐనాక్స్ షేర్ల ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వ్వ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక తెలుగు సినిమా షేర్ మార్కెట్ లో కంపెనీ స్టాక్ ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది అనేది విన‌డానికే ఆస‌క్తిక‌రంగా ఉంది. సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడ్‌లో బిఎస్‌ఇలో పివిఆర్ ఐనాక్స్ షేరు 6 శాతం పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయి రూ.1,512.60ని తాకింది. బిజినెస్ రికవరీపై భారీ అంచనాల మధ్య ఈ ఫ‌లితం ఆస‌క్తిని క‌లిగించింది. గ‌త ఏడాది గ‌రిష్ఠ స్థాయిని తాకి, తిరిగి త‌క్కువ స్థాయికి షేర్ దిగిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి షేర్ల‌కు రెక్క‌లొచ్చాయి. ట్రేడ్ విశ్లేష‌కుల‌ క‌థ‌నాల ప్రకారం.. గత వారం థియేటర్లలో విడుదలైన కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా డబ్బును వసూలు చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ బహుభాషా 3డి చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర బృందం తెలిపింది.

Read more!

భారతదేశంలో మల్టీప్లెక్స్ స్క్రీన్ కౌంట్ పరంగా PVR ఐనాక్స్ మార్కెట్ లీడర్ కావ‌డం కూడా భారీ వ‌సూళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించింది. ప్రస్తుతం ఇది భారతదేశం, శ్రీలంకలోని 112 నగరాల్లో 361 మ‌ల్టీప్లెక్సుల్లో 1,748 స్క్రీన్‌లను నిర్వహిస్తోంది. ఈ సోమ‌వారం మధ్యాహ్నం 02:45 గంటలకు, బిఎస్ఇ సెన్సెక్స్‌లో 0.6 శాతం పెరుగుదలతో పోలిస్తే పీవీఆర్ ఐనాక్స్ 5 శాతం పెరిగి రూ.1,495 వద్ద ట్రేడయింది. ఎన్‌ఎస్‌ఇ -బిఎస్‌ఇలో ఏకంగా 2.8 మిలియన్ షేర్లు చేతులు మారడంతో కౌంటర్‌లో సగటు ట్రేడింగ్ పరిమాణం నేడు దాదాపు మూడు రెట్లు పెరిగింది.

FY25 నాటికి త‌మ కంపెనీ షేర్ విలువ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పీవీఆర్ ఐనాక్స్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. Q2FY25 లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుద‌ల‌ల‌తో మ‌ళ్లీ మార్కెట్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. పుష్ప 2, కాంతార 2, ఇండియన్ 2, డెడ్‌పూల్ & వోల్వరైన్, డెస్పికబుల్ మీ 4, ట్రాన్స్‌ఫార్మర్స్ వన్, జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్, గ్లాడియేటర్ II లాంటి భారీ క్రేజీ సీక్వెల్ సినిమాల‌తో పీవీఆర్ కి మ‌రింత ఊపు రానుంది. FY24-26E కంటే బాక్సాఫీస్ రాబడులలో 10 శాతం/17 శాతం CAGRని పెంచుతుందని అంచనా.. పీవీఆర్ ఐనాక్స్ షేర్ మునుముందు 1700 రేంజుకు ఎద‌గ‌డం ఖాయ‌మని కూడా విశ్లేషిస్తున్నారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసికం (Q1FY25) ఫ‌లితం లేనిదిగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), T20 ప్రపంచ కప్ , సాధారణ ఎన్నికలు సినిమా విడుదలలకు అడ్డంకులుగా మారాయి. దీంతో పీవీఆర్ చైన్ లో టికెట్ అధిక ధ‌ర‌లు తీవ్రంగా ప్ర‌భావితం చేసాయి. అయితే మెగా బ‌డ్జెట్ సినిమాల రాక‌ను బ‌ట్టి కూడా పీవీఆర్ చైన్ షేర్ ధ‌ర‌లు పెర‌గ‌డంలో ప్ర‌భావం చూపుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News