చీరలో రాశి ఖన్నా.. అందమే అసూయ పడేలా..

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Update: 2024-10-28 19:30 GMT

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పసుపు రంగు చీరలో దిగిన ఈ తాజా ఫొటో షూట్‌లో ఆమె చీరకట్టులో సంప్రదాయ సొగసుతో కనిపిస్తూ ఫ్యాన్స్‌ని అలరించింది. ఈ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాశీ, "నా ఔట్‌ఫిట్‌లా ప్రకాశవంతమైన దీపావళి మీకు ఉండాలని కోరుకుంటున్నా!" అంటూ సందేశాన్ని జోడించింది.

రాశీ ఖన్నా తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషిస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె గతంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రాశీ, తర్వాత 'సుప్రీమ్,' 'జై లవ కుశ,' 'తొలిప్రేమ,' 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ చిత్రాలలో నటించి తన టాలెంట్ ను చూపించింది.

ఇటీవల ఆమె చేసిన 'అరణ్మనై 4' అనే తమిళ హారర్ కామెడీ మూవీ ఘన విజయం సాధించడంతో రాశీ ఖన్నా సక్సెస్ ట్రాక్‌లో ఉన్నట్లు ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం రాశీ ఖన్నా తన చేతిలో ఉన్న మరో తెలుగు మూవీ 'తెలుసుకదా' కోసం కష్టపడుతోంది. జోడీగా సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటిస్తోంది. ఈ సినిమాతో రాశీ టాలీవుడ్‌లో మళ్లీ ఫేమ్ సంపాదించేందుకు సిద్ధమవుతోంది.

రాశీ ఖన్నా తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ధరించిన ప్రతి ఔట్‌ఫిట్‌ను సోషల్ మీడియాలో అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. రాశీ తన ఫొటో షూట్‌లను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. లేటెస్ట్ ఫొటో షూట్ లో చీరలోని అందం పసుపు రంగుతో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. డిజైనర్ డాలీ జి స్టూడియో ఔట్‌ఫిట్‌లో ఆమె ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరినీ మంత్రముగ్దులను చేసింది.

Tags:    

Similar News