రాశీఖన్నా డేటింగ్ ఇద్దరితో!
రాశీఖన్నా ఓ దశలో బరువు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి కారణం మానసిక ఒత్తిడి అంది. ప్రేమించిన వాడు దూరం ఆకవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందిట.
టాలీవుడ్ లో ఉన్నతం కాలం రాశీఖన్నా కామ్ గోయింగ్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏ నాడు అమ్మడి పై ఎలాంటి రూమర్స్ రాలేదు. టాలీవుడ్ లో ఏ హీరోతోనూ డేటింగ్ వెళ్లినట్లు గానీ..ఎఫైర్లు నెరిపినట్లు గానీ ప్రచారం కూడా రాలేదు. వివాదాస్పద అంశాలపైనా స్పందించింది లేదు. తనపని తాను చేసుకోవడం తప్ప! ఇవర విషయాలపట్ల అవగాహన లేమిగానే కనిపించేది. అయితే అప్పుడు రాశీ వేరు..ఇప్పుడు రాశీఖన్నా వేరనిపిస్తోంది.
కోలీవుడ్ లో బిజీ అవుతున్న దగ్గర నుంచి కొత్త రాశీఖన్నాని పరిచయం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఎఫైర్లు లేవు అనుకున్న రాశీ ఏకంగా ఇద్దరితో డేటింగ్ చేసినట్లు తానే స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చింది. డేటింగ్ కారణంగా బరువు తగ్గానని చెప్పి అడ్డంగా బుక్కైంది. రాశీఖన్నా ఓ దశలో బరువు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి కారణం మానసిక ఒత్తిడి అంది. ప్రేమించిన వాడు దూరం ఆకవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందిట.
ఆ సమయంలో విపరీతంగా బరువు పెరిగిందిట. ఆ ప్రభావం తాను నటించే సినిమాల మీద పడిందట. ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గలేదుట. దీనికి తోడు థైరాయిడ్ సమస్య కూడా అప్పటికే ఉందిట. దీంతో ఫిట్ నెస్ ట్రైనర్ బరువెందుకు తగ్గలేదని ఎంత ఆలోచించినా అర్దమయ్యేది కాదట. చివరికి ట్రైనర్ ని మార్చినా ఫలితం దక్కలేదుట.
అయతే అప్పటికే డేటింగ్ చేసిన వ్యక్తికి దూరమై మరో కొత్త వ్యక్తితో డేటింగ్ మొదలు పెట్టిందిట. ఈసారి మాత్రం బరువు లో భారీ మార్పులే వచ్చాయట. ఇలా ఓపెన్ గా అమ్మడు ఇద్దరితో డేటింగ్ విషయాన్ని బట్ట బయలు చేయడం ఇదే తొలిసారి. టాలీవుడ్ మీడియా అడిగినంత కాలం ఏ రోజు ఈ విషయాన్ని ఓపెన్ చేయలేదు.
అయితే రాశీఖన్నా డేటింగ్ చేస్తోన్న ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. రాశి ఖన్నా చివరిగా తెలుగు లో హీరోయిన్ గా నటించిన 'పక్కా కమర్షియల్'.. 'థాంక్యూ' చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూర్తి స్థాయి లో కోలీవుడ్ పై దృష్టి పెట్టింది.