రాశి ఖన్నా.. ట్రెడిషనల్ లుక్కులో కూడా అదే హీటు!
రీసెంట్ గా అమ్మడు అదే తరహాలో ఒకవైపు ట్రెడిషనల్ లుక్ ను హైలెట్ చేస్తూనే మరొకవైపు తన అందాన్ని కూడా మరింతగా హైలెట్ చేసింది.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే బబ్లీ గర్ల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది రాశి ఖన్నా. ఈ ఢిల్లీ పాపకు మొదట్లోనే బాలీవుడ్ లో కూడా కొన్ని చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. అయితే అటువైపు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరోవైపు తెలుగులో హీరోయిన్ గా సినిమాలో చేసుకుంటూ వచ్చింది. తన స్థాయిని పెంచుకోవాలని ఈ బ్యూటీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ను అయితే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.
కానీ ఆమె ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు చాలా వరకు నిరాశ పరిచాయి. అయినప్పటికీ కూడా అమ్మడు తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే తన గ్లామర్ ను మరింత ఎక్కువగా హైలెట్ చేసింది. గతంలో స్టైలిష్ డ్రెస్ లలో కూడా కనిపించిన రాశి అప్పుడప్పుడు చీరలో కూడా మెప్పిస్తూనే ఉంటుంది.
ఇక చుడిదార్ లాంటి డ్రెస్సుల్లో కూడా తన గ్లామర్ ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు అదే తరహాలో ఒకవైపు ట్రెడిషనల్ లుక్ ను హైలెట్ చేస్తూనే మరొకవైపు తన అందాన్ని కూడా మరింతగా హైలెట్ చేసింది. ఇక ఆ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ గా మారిపోయాయి. రాశి ఖన్నా ఎలా కనిపించినా కూడా చాలా అందంగా ఉంటుంది అంటూ ఆమె ఫాలోవర్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే మొదట్లో కాస్త లవ్ స్టోరీలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత రవితేజ సందీప్ కిషన్ రామ్ గోపిచంద్ లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రాశిఖన్నా ఈ ఏడాది కొన్ని డిఫరెంట్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
ముఖ్యంగా తమిళ్ తెలుగులో ఒకేసారి రాబోతున్న హారర్ మూవీ అరన్మలై 4 సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే హిందీలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ 'తెలుసు కదా' అనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఇక తమిళంలో కూడా ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తంగా అమ్మడు ఈ ఏడాది ఒక ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతాయో చూడాలి.