రాశీఖన్నా టాలీవుడ్ జర్నీ ముగిసినట్లేనా?
గతే డాది థాంక్యూ అనే తెలుగు సినిమాలో నటించింది. అదే అమ్మడి చివరి తెలుగు సినిమా కూడా. ఆతర్వాత టాలీవుడ్ లో కొత్త సినిమాకి సంతకం చేసింది లేదు.
అందాల రాశీఖన్నా టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఊహలు గుసగుసలాడే 'సినిమాతో పరిచయమైన అమ్మడు అటు పై చాలా సినిమాలు చేసింది. దాదాపు టైర్ -2 హీరోలందరితో నటించింది. కానీ అమ్మడికి ఇక్కడ రావాల్సినంత గుర్తింపు రాలేదు. సరైన బ్లాక్ బస్టర్లు అంటూ అమ్మడి కెరీర్ లో లేవనే చెప్పాలి. అయినప్పటికీ అవకాశాల పరంగా అందుకుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో కూడా లాంచ్ అయింది. అలా కొన్నాళ్ల పాటు రెండు పరిశ్రమల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది.
గతే డాది థాంక్యూ అనే తెలుగు సినిమాలో నటించింది. అదే అమ్మడి చివరి తెలుగు సినిమా కూడా. ఆతర్వాత టాలీవుడ్ లో కొత్త సినిమాకి సంతకం చేసింది లేదు. తాజాగా అమ్మడి ట్రాక్ చూస్తే టాలీవుడ్ కన్నా కోలీవుడ్..బాలీవుడ్ పైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రెండు భాషల్లోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. తమిళ్ లో రెండు సినిమాలు..హిందీలో 'యోధ'లో నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి.
తాజాగా విక్రమ్ మాస్సే తో ఓ రొమాంటిక్ చిత్రం చేయడానికి సైన్ చేసింది. ఇది అమ్మడి మూడవ హిందీ సినిమా. అలాగే కోలీవుడ్ కొత్త కథలు వింటోంది. దీంతో రాశీ బిజీ అంతా ఆ రెండు భాషల్లోనే ఏడాది కాలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు అవకాశాలు బాగా తగ్గినట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఛాన్సులు రిజెక్ట్ చేసే టైపు కాదు రాశీ. అమ్మడు ఇక్కడ పనిచేసినంత కాలం జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది.
ప్లాప్ అయిన తన అందంతో మెప్పించగల్గింది. యువతలో అటెన్షన్ డ్రా చేసింది. తెలుగు అవకాశాలు రావడానికి కూడా అదే కారణం. నటిగా ఆమె మార్క్ అంటూ ఎక్కడా పడలేదు. కేవలం గ్లామర్ తో మాత్రమే ఇన్నాళ్లు ముందుకు సాగింది. మరి కోలీవుడ్...బాలీవుడ్ లో గ్లామర్ తో నెట్టుకొస్తుందా? ట్యాలెంట్ తో నిలదొక్కుకుంటుందా? అన్నది చూడాలి.