బంజారా స్టైల్లో మెరిసిన అంబానీ కోడలు!
అంబానీ ఇంట కోడలిగా అడుగు పెట్టిన రాధికా మర్చెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కాదు..టాక్ ఆఫ్ ది వరల్డ్
అంబానీ ఇంట కోడలిగా అడుగు పెట్టిన రాధికా మర్చెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కాదు..టాక్ ఆఫ్ ది వరల్డ్. అంబానీ ఇంట కోడలిగా ఖాయమైన నాటి నుంచి ఎంగేజ్ మెంట్, ప్రీవెడ్డింగ్ వేడుకలు, వివాహం ప్రతీ సందర్భంలోనూ ఫ్యాషన్ పరుగులు పెట్టించింది. ప్రతీసారి ఎంతో అందంగా ముస్తాబైంది. ఇండియా వైడ్ ఉన్న ఫ్యాషన్ డిజైర్లు అంతా ఆమె కోసమే పనిచేసారు. ఆమెని ప్రత్యేకంగా అలంకరించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిజైనర్లు, స్పెషలిస్టులు ఒకరికొకు పోటీ పడుతూనే ఉన్నారు.
ఎంగేజ్ మెంట్ రోజున ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో ఆకట్టుకుంది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకలో గుజరాతీ బ్యూటీని తలపించింది. గాగ్రా చోళీ లెహంగాలో అద్బుతంగా కనిపిం చింది. దీన్ని అనురాధా వకీల్ డిజైన్ చేసారు. ఇక హల్దీ వేడుకలో పూలోం కా చాదర్ స్టైల్ లో అదర గొట్టింది. ఈ దుపట్టాని మల్లెపూల మొగ్గలతో అంచులను బంతిపూలతో తయారు చేయించారు.
డిజైనర్ అనామికా ఖన్నా దీన్ని రూపొందించారు. గ్రేస్ లింగ్, రియా కపూర్, జూలియా హక్ మన్ లాంటి విదేశీ డిజైనర్లు రూపొందిచన దుస్తుల్లో రాధిక మర్చంట్ తళుక్కున మెరిసారు. తాజాగా వివాహ వేడుక కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాయాని రూపొందిచిన మల్టీకలర్ లెహంగాలో మరింత అందంగా కనిపిస్తున్నారు. దీన్ని బంజారా స్టైల్ లెహంగా అంటారు. ఇలాంటి వాటిని డిజైన్ చేయడంలో తరుణ్ స్పెషలిస్ట్.
ప్రత్యేకంగా ఓ పెద్ద బోటిక్ నే నిర్వహిస్తున్నారు. ఇందులో రకరకాల డిజైన్స్ అన్ని దేశంలో కేవలం అక్కడ మాత్రమే లభ్యమవుతాయి. పెళ్లి కోసం రాధికా మర్చంట్ ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. లెహంగా మ్యాచింగ్ మెడలో మణిహారం, చెవులీలు మరింత అందంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.