భార్య కోసం భర్త పొర్లుదండాలు పెట్టినా పనవ్వలేదే!
ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున సెలబ్రిటీలు కూడా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అందులో చాలా మంది సెలబ్రిటీలు గెలిచిన వాళ్లు ఉన్నారు.
ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున సెలబ్రిటీలు కూడా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అందులో చాలా మంది సెలబ్రిటీలు గెలిచిన వాళ్లు ఉన్నారు. ఓడిన వాళ్లు ఉన్నారు. గెలిచిన వాళ్లంతా ఉత్సాహంలో ఓడిన వారంతా ఓటమికి కారణాల్ని విశ్లేషించుకుంటున్నారు. ఇదే ఎన్నికల్లో బీజేపీ నుంచి నటి రాధిక కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని విరుదునగర్ నుంచి పార్లమెంట్ కి పోటీ చేసారు. కానీ ఫలితం ఆమెకి అనుకూలంగా రాలేదు.
ఆమె పోటీ చేసిన స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మాణిక్కం ఠాగూరు విజయం సాధించారు. దీంతో రాధిక మూడవ స్థానానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే రాధిక గెలవాలని ఆమె భర్త శరత్ కుమార్ ఎంతగా శ్రమించారో తెలిసిందే. ఆమె తరుపున భారీ ఎత్తున క్యాపెనింగ్ నిర్వహించారు. నియోజక వర్గమంతా విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తోడుగా ఉంటామని మాటిచ్చారు.
అలాగే శరత్ కుమార్ కి దైవ భక్తి కూడా ఎక్కువే అని తెలుస్తుంది. రాధిక గెలవాలని ఆయన చేయని పూజ అంటూ లేదని తాజాగా లీకైన వీడియోని బట్టి తెలుస్తుంది. ఓ గుడిలో పూజలు చేసి పొర్లుదండాలు కూడా పెట్టారు. చొక్కా విప్పేసి నేలపై దొర్లుతూ దేవుడుకి నమస్కరించారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో శరత్ కుమార్ పై చిన్న పాటి ట్రోలింగ్ కూడా నడుస్తుంది. పొర్లుదండాలు పెట్టినా పనవ్వలేదంటూ ప్రత్యర్ది వర్గం కామెంట్లు పోస్ట్ చేస్తుంది.
రాధికకు భర్తగా అన్ని రకాల సహకారాలు అందించారని కానీ ప్రజలు మరొకర్ని ఎన్నుకున్నారు. ఇది ప్రజా తీర్పు. గెలుపోటములు సహజం. తప్పుల్ని సమీక్షించుకుని వచ్చే ఎన్నికల వరకూ ఎదురు చూడటం, అంత వరకూ ప్రజలతో మమేకం అవ్వడమే ముఖ్యమన్నది నేతలు గమనించాల్సి విషయంగా చెప్పుకొస్తున్నారు.