డబ్బు దుర్వినియోగం.. రాజ్ & డీకే ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో..
ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీతో సంచలనాలు సృష్టించిన రాజ్ అండ్ డీకే ఆ తర్వాత `ఫర్జీ` వెబ్ సిరీస్‌తోను మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీతో సంచలనాలు సృష్టించిన రాజ్ అండ్ డీకే ఆ తర్వాత `ఫర్జీ` వెబ్ సిరీస్‌తోను మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం `రక్త్ బ్రహ్మాండ్`కి క్రియేటివ్ రచయితలుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఊహించని ట్రబుల్స్ ని ఎదుర్కొంటోందని మీడియాలో కథనాలొచ్చాయి.
ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిధులను దుర్వినియోగం చేయడంతో షూటింగ్ ఇబ్బందుల్లో పడిందని, దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా దర్యాప్తు జరుగుతోందని మీడియాలో కథనాలొచ్చాయి. పర్యవేక్షణ బాధ్యతను చేపట్టిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుమారు 3 కోట్ల వరకూ నిధులను దుర్వినియోగం చేసారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024 నుండి కేవలం 26 రోజుల చిత్రీకరణ మాత్రమే జరిగింది. బడ్జెట్‌లో సగం ఇప్పటికే ఖర్చయింది. నిధి పక్కదారి పట్టడంతో ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ - D2R ఫిల్మ్స్ థర్డ్ పార్టీని దీనిపై దర్యాప్తునకు ఆదేశించాయని తెలిసింది. ఆర్థిక అవకతవకలపై ఒక రిపోర్ట్ ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున వివరాల్ని గోప్యంగా ఉంచినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
నిర్మాతలు అనాలోచితంగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతను నమ్మి చెక్కులపై సంతకం చేయడానికి , సరైన పర్యవేక్షణ లేకుండా నిధులను ఉపయోగించుకునేందుకు అధికారాన్ని ఇచ్చారు. ఇదే ఎగ్జిక్యూటివ్ నిర్మాత గత ప్రాజెక్టులలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నా మరోసారి అతడిపై నమ్మకం ఉంచారు. చివరికి అతడిని నమ్మినందుకు మోసం జరిగిందని ఇరు నిర్మాణ సంస్థలు రియలైజ్ అయినట్టు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ పరిణామానికి తీవ్ర అసంతృప్తికి గురైంది. ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయింది. పాపులర్ ఫిలింమేకర్స్ రాజ్ అండ్ డీకే ప్రతిష్ఠకు ఇలాంటివి భంగం కలిగిస్తాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
`రక్త బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్` పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తోంది. తుంబాద్ దర్శకుడు రాహి అనిల్ బార్వే ఈ సిరీస్ కి దర్శకుడు. ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమంత ఈ చిత్రంలో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నారని కథనాలొచ్చాయి. ఇంతకుముందు విడుదలైన పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది.