రెబల్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ దండోరా..!
అంతేకాదు క్రిస్మస్, న్యూ ఇయర్ కి రాజా సాబ్ అప్డేట్ వస్తుందన్న వార్తలను ఖండించారు మేకర్స్.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉండటంతో ఫ్యాన్స్ ఏ సినిమా అప్డేట్ అయినా వస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇక ఫెస్టివల్ ఏదైనా వస్తుంది అంటే చాలు ప్రభాస్ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశ పడతారు. ఫ్యాన్స్ ని మెప్పించడానికే ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా సినిమాలు లైన్ లో పెట్టాడు. ఈ ఇయర్ ఆల్రెడీ కల్కి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ రాజా సాబ్ తో రాబోతున్నాడు.
ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుందని అంటున్నారు. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అని అనౌన్స్ చేసిన రాజా సాబ్ పై ఎప్పుడు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈమధ్యనే రాజా సాబ్ సినిమా అనుకున్న డేట్ కి రావడం కష్టమని అంటున్నారు. అది చాలదు అన్నట్టుగా రాజా సాబ్ నుంచి టీజర్ త్వరలో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. క్రిస్ మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా రాజా సాబ్ అప్డేట్ వస్తుందని వార్తలు జోరందుకున్నాయి.
ఐతే ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూ మరోసారి ఫ్యాన్స్ ని అలర్ట్ చేశారు మేకర్స్. రాజా సాబ్ మేకర్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. సినిమాపై వస్తున్న వార్తలన్నీ కూడా ఏది నిజం కాదు వాటిని నమ్మొద్దని. టీజర్ ని ఫ్యాన్స్ అంతా మెచ్చుకునేలా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని. దానికి కాస్త టైం పడుతుందని ప్రకటించారు. అంతేకాదు క్రిస్మస్, న్యూ ఇయర్ కి రాజా సాబ్ అప్డేట్ వస్తుందన్న వార్తలను ఖండించారు మేకర్స్.
ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై మొదలైనప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. సినిమా మొదలవడం సీక్రెట్ గా మొదలైనా మారుతి స్పీడ్ గానే లాగిస్తున్నాడు. ఐతే సినిమాకు కాస్త ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అవసరం పడుతుంది. అందుకే ఏప్రిల్ 10 రిలీజ్ అనుకున్నా ఆ టైం కు కష్టమని తెలుస్తుంది. మరి ప్రభాస్ రాజా సాబ్ పై మేకర్స్ నుంచి ఎప్పుడు టీజర్ అప్డేట్ ఇంకా రిలీజ్ అనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.
ఈ సినిమా తో పాటు ప్రభాస్ ఓ పక్క హను రాఘవపుడితో ఫౌజి చేస్తున్నాడు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ త్వరలో జాయిన్ అవనున్నాడు. మరోపక్క సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ మొదలు పెడుతున్నాడు ప్రభాస్.