సర్ ప్రైజ్ కు సిద్దమవుతున్న రాజాసాబ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. హర్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాని మారుతి రెడీ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సంజయ్ దత్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఈ చిత్రం రాబోతోంది. అయితే ప్రభాస్ కెరియర్ లో తక్కువ బజ్ ఉన్న చిత్రంగా ‘ది రాజాసాబ్’ ఉండేది. కానీ పోస్టర్స్, గ్లింప్స్ తో మూవీ పైన అంచనాలు పెంచేశారు. ఈ మధ్య వచ్చిన పోస్టర్ లో ప్రభాస్ ఓల్డ్ లుక్ లో సింహాసనంపై కూర్చొని ఉన్నట్లు చూపించారు.
అంటే ప్రభాస్ ఈ సినిమాలో ఏమైనా డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అనే ప్రశ్న ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసిందంట. డిసెంబర్ నెలఖారుకి మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కి ‘ది రాజాసాబ్’ నుంచి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో మారుతి ఉన్నారని తెలుస్తోంది.
అలాగే సంక్రాంతి కానుకగా ఒక మాస్ సాంగ్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ డాన్స్ మూమెంట్స్ ఉంటాయని ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పారు. అదిరిపోయే మాస్ బీట్స్ ని ఇస్తున్నట్లు ఓ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే అందంగా కనిపిస్తున్నాడు.
అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై కొంత ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మారుతి కెరియర్ లో ఫస్ట్ టైం టైర్ 1 హీరోతో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రభాస్ స్టోరీ సెలక్షన్స్ ఈ మధ్యకాలంలో కాస్తా విభిన్నంగా ఉంటున్నాయి. అందుకే ‘ది రాజాసాబ్’ చిత్రంలో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ఆసక్తికరమైన ఎలిమెంట్ ఏదో ఒకటి ఉండొచ్చని అనుకుంటున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.