అక్కడ బన్నీ కోసం చచ్చిపోతున్నారు: రాజమౌళి
ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు దర్శకులు కూడా ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ కూడా పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హైదరాబాదులోని పుష్ప 2 జాతర ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు దర్శకులు కూడా ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
అలాగే దర్శకదీరుడు రాజమౌళి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆయన సినిమా గురించి మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప 1 సినిమా ప్రీ రిలీజ్ టైమ్ లో బన్నీకి నేను ఒకటే చెప్పాను. నార్త్ ఇండియాని వదలొద్దు.. అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు. అక్కడ అక్కడ కూడా ప్రమోషన్స్ చేయి అని చెప్పాను. అయితే ఇప్పుడు మాత్రం అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు.
ఎందుకంటే ఇండియా మొత్తం, ప్రపంచంలో ఉన్నా ఇండియన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారు అని అనిపిస్తుంది. అలాగే మనం సినిమాకు హెల్ప్ అయ్యేలా ఏదో ఒకటి మాట్లాడాలని అనుకుంటాం. కానీ ఈ సినిమాకు అది కూడా అవసరం లేదు. అంతగా ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.
అయితే మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను.
ఒక మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లాను. అక్కడ సుకుమార్ ఒక సన్నివేశం చూపించారు. అది ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్ప రాజ్. ఆ సీన్ మొత్తం చూశాను. చూసిన తర్వాత నేను ఒకటే చెప్పాను. సీన్ కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత హైలెట్ అవుతుందని చెప్పాను. అంతా ఎక్సలెంట్ సీన్ చూపించారు. కేవలం నేను ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే చూశాను. ఇక మిగతా సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు అర్థమైపోతుంది . ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలని అనిపించడం లేదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అని రాజమౌళి తన వివరణ ఇచ్చాడు