కెన్యాలోనే కాదు అరకు గుహల్లోనూ #SSMB 29!
ఇటీవలే కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో లొకేషన్ విజిట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం దర్శక దిగ్గజం రాజమౌళి ప్రపంచంలో ఉన్న అడవులన్నింటిని చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుడికి రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం జక్కన్న ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎంపిక చేసే పాత్రల నుంచి లొకేషన్ల వరకూ ఏ విషయంలో రాజమౌళి తగ్గడం లేదు. ఇటీవలే కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో లొకేషన్ విజిట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇంకా మరెన్నో లొకేషన్లను జక్కన్న రహస్యంగా సందర్శించారు. అన్ని వీడియోలు లీక్ చేస్తే ప్రేక్షకుడిలో థ్రిల్ మిస్ అవుతుందని వాటిని రహస్యంగా ఉంచారు. ఇదంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం రాజమౌళి ఏపీ లొకేషన్లను సైతం కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ లొకేషన్లతో పాటు దేశం సహా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందమైన అద్భుతమైన లొకేషన్లలోనూ తన సినిమా షూటింగ్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా ఆయన ఎంతో ఇష్టపడే విశాఖపట్టణంకు సమీపంలోని అరకు బొర్రా గుహలు మరోసారి జక్కన్న షూటింగ్ స్పాట్ గా మారబోతున్నాయి. మహేష్ సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఈ గుహల్లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. దీనిలో భాగంగా ఆయన శనివారం బోర్రా గుహలను మరోసారి సందర్శించినట్లు తెలుస్తోంది. రాజమౌళి తన టీంతో కలిసి విజిట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ షూటింగ్ జక్కన్నకు కొత్తేం కాదు.
'ఆర్ ఆర్ ఆర్' లో ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇదే బొర్రా గుహాల్లో నిర్వహించారు. తారక్ తో పాటు మరికొంత మంది కీలక నటులు ఆ సన్నేవేశాల్లో భాగమయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి బోర్రా గుహలు రాజమౌళి సినిమా కోసం ముస్తాబవ్వాల్సి వస్తోంది. అయితే సినిమా ప్రధాన భాగమంతా ఆఫ్రికన్ ప్రాతంలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో మహేష్ కిజోడీగా ఇండో-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ ను తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.