SSMB29: ఇందుకేనా ఆలస్యం?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి SSMB29 మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-27 10:23 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి SSMB29 మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అయితే మూవీ నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు వస్తుందనేది కూడా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం అయితే నడుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే షూటింగ్ కి సిద్ధంగా ఉన్నారు. స్క్రిప్ట్ రెడీ అయిపొయింది. వర్క్ షాప్ కూడా చేయనున్నారు. అయితే అఫీషియల్ గా ఒక అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు అనేది అంతు చిక్కడం లేదు. తాజాగా ఈ ఆలస్యంపై ఇండస్ట్రీ ఓ న్యూస్ తెగ వినిపిస్తోంది. SSMB29 సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థని భాగస్వామిగా చేయాలని అనుకుంటున్నారంట. ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్నకి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది.

హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు, మేకర్స్ కూడా జక్కన్న సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి SSMB29 సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారంట. మూడు ప్రొడక్షన్ కంపెనీలతో జక్కన్న చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవరో ఒకరు ఫైనల్ అయ్యి ఈ సినిమా నిర్మాణానికి ముందికొస్తే హాలీవుడ్ రేంజ్ లో సినిమాకి ఫోకస్ దొరుకుతుందని రాజమౌళి ఆలోచిస్తున్నారంట.

పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి SSMB29 సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అలాగే ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో రిలీజ్ చేయాలంటే హాలీవుడ్ లెవల్ లో రీచ్ అవసరమని భావించి అక్కడి నిర్మాణ సంస్థలతో మాట్లాడుతున్నట్లు టాక్. ప్రస్తుతం దీనికోసం డిస్కషన్స్ నడుస్తున్నాయంట. ఈ డీల్ ఒకే అయితే తరువాత హాలీవుడ్ యాక్టర్స్ ని సైతం SSMB29 లో భాగం చేసే అవకాశం ఉందంట.

త్వరలో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టాండర్డ్స్ కి ఇండియన్ సినిమాని రాజమౌళి రీచ్ చేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏకంగా హాలీవుడ్ మూవీని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. జక్కన్న ఇమాజినేషన్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలకి కనెక్ట్ అయ్యి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయితే 1500 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించే ఛాన్స్ ఉంటుందంట.

Tags:    

Similar News