రాజమౌళి - ప్రశాంత్ వర్మ.. తెలుగులో ఇద్దరే ఇలా
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు కొత్త కంటెంట్ తో, బలమైన ఎమోషన్స్ తో వచ్చేవి సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి.
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు కొత్త కంటెంట్ తో, బలమైన ఎమోషన్స్ తో వచ్చేవి సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో వండర్ క్రియేట్ చేశాయో చెప్పాల్సిన పని లేదు. వంద కోట్లకి పైగా లాభాలని ఈ సినిమాలు ఆర్జించాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వంద కోట్లకి పైగా లాభాలు సాధించిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
బాహుబలికి ముందు వంద కోట్ల లాభం అంటే తెలుగు సినిమాకి గగనమే అని అనుకునేవారు. ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ వచ్చిన లాభాలు మాత్రం తక్కువగానే ఉండేవి. అయితే మార్కెట్ స్పాన్ పెరిగిన తర్వాత తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ భాషలలో అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాలు రిలీజ్ కావడమే కాకుండా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వంద కోట్ల ప్రాఫిట్ అనేది చిన్న విషయంగా మారిపోయింది.
అయితే బడ్జెట్ లు పెరిగిపోవడం వలన సినిమా సక్సెస్ అయిన లాభాలు తక్కువగా ఉంటున్నాయి. అయితే బాహుబలి 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1900 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. అలాగే సినిమాకి వచ్చే ప్రాఫిట్ కూడా 500 కోట్లకి పైనే. తరువాత జక్కన్న నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా 300 కోట్లకి పైగా ప్రాఫిట్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది.
రాజమౌళి తర్వాత సౌత్ లో వంద కోట్లకి ప్రాఫిట్ అందుకున్న దర్శకుడు అంటే ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి అని చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ 2తో ప్రశాంత్ నీల్ వంద కోట్లకి పైగా ప్రాఫిట్ ని అందుకున్నారు. కాంతారా మూవీకి పాన్ ఇండియా స్థాయిలో వంద కోట్లకి పైగా ప్రాఫిట్ వచ్చింది. అయితే టాలీవుడ్ లో చూసుకుంటే రాజమౌళి తర్వాత వంద కోట్ల ప్రాఫిట్ సాధించిన దర్శకుడిగా హనుమాన్ తో ప్రశాంత్ నీల్ అరుదైన ఫీట్ సాధించాడు.
ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా ఇది సాధ్యం కాలేదు. హనుమాన్ తర్వాత హైయెస్ట్ ప్రాఫిట్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే గీతాగోవిందం, బేబీ, విరూపాక్ష, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇవేవీ కూడా వంద కోట్ల లాభాలని మాత్రం దక్కించుకోలేదు.