ఎవరు దారిలోకి ఎవరొస్తారు?
సూపర్ స్టార్ మహేష్ ఏడాదిలో కనీసం ఆరేడు సార్లైనా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లే అలవాటుంది
సూపర్ స్టార్ మహేష్ ఏడాదిలో కనీసం ఆరేడు సార్లైనా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లే అలవాటుంది. కొత్త సినిమా ప్రారంభానికి ముందు...షూటింగ్ మధ్యలో...షూటింగ్ పూర్తయిన తర్వాత..సినిమా రిలీజ్ తర్వాత..మధ్యలో అనుకోకుండా హాలీడేస్ వచ్చినా...న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినా వెకేషన్ ప్లైట్ ఎక్కాల్సిందే. మహేష్ కొంత కాలంగా అనుసరిస్తోన్న రూల్ ఇది. ఆయన డిక్షనరీలో సైతం తరుచూ కనిపించే పదం అది. పూర్తిగా ఒక సినిమా కోసం ఎలాంటి విరామం లేకుండా పనిచేయడం అన్నది ఇంతవరకూ ఆయన కెరీర్ లో ఏ సినిమాకి చోటు చేసుకోలేదు.
ఇది మహేష్ వెర్షన్.. ఇక దర్శకధీరుడు రాజమౌళి తో కమిట్ మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా గ్యాప్ ఉండదు. రిలీజ్ అయ్యే వరకూ ఆయనతో ట్రావెల్ చేయాల్సిందే. చివరికి ప్రమోషన్ విషయంలో కూడా హీరో సొంత నిర్ణయాలు అంటూ ఉండవు. రాజమౌళి ఎలా చెబతితే అలా ముందుకె ళ్లాల్సిందే. ప్రభాస్..రానా...ఎన్టీఆర్..రామ్ చరణ్ అంతా అలా పనిచేసిన వారే. తామెంత పెద్ద స్టార్ అయినా జక్కన్న ముందుకొచ్చే సరికి అటెన్షన్ పోజిషన్ లోనే ఉండాలి.
మహేష్ ఈ హీరోలందరికీ పూర్తి భిన్నంగా ఉంటారు. రాజమౌళితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో? ఆయన తో జర్నీ ఎలా ఉంటుందో ఆ నలుగురు హీరోలకు బాగా తెలుసు. క్షణం వదిలి పెట్టడు..సెట్ లో ఉన్నంత సేపు పిండేస్తాడు. సెలవులు ఇవ్వడు. సీన్ విషయంలో కాంప్రమైజ్ కాడు. ఇలా ఎన్నో ఆరోపణలు తారక్ చేయకనే చేసాడు సరదాగా. ప్రభాస్..రానా..చరణ్ సైలెంట్ గా ఉన్నారే తప్ప బయటకు ఒపెన్ కాలేకపోయారు. మరి అలాంటి రాజమౌళితో మహేష్ ఎలా?
మహేష్-రాజమౌళి ఇద్దరు వేర్వేరు ధృవాలు. ఇప్పుడు కలిసి పనిచేయడంతో ఎవరి దారిలోకి ఎవరు వస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ అడిగినట్లు జక్కన్న వెకేషన్ సెలవులిస్తాడా? లేక రాజమౌళికి బాండ్ అయి మహేష్ పనిచేస్తాడా? అన్నది చూడాలి. ఇద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రకటించగానే ప్రేక్షకులంతా మహేష్ వెకేషన్ గురించి చర్చించుకుంటోన్న సంగతి తెలిసిందే.