అమ్మకోసం ఏడ్చి ఏడ్చి చనిపోయే స్టేజ్ కొచ్చా! రాజేంద్రప్రసాద్
ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా ఓ షోలో ఆయన చిన్న నాటి కష్టాల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ధాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న గొప్ప నటుడు. నటుడిగా..కమెడియన్..క్యారెక్టర్ ఆర్టిస్టిగా పరిశ్రమకి ఆయన అందించిన సేవలు అసామాన్య మైనవి. నటనలో ఆయనకు ఆయనే పోటి...ఆయన లేరు ఎవరు సాటి.
ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా ఓ షోలో ఆయన చిన్న నాటి కష్టాల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. 'నా చిన్నప్పుడే అమ్మ చనిపో యింది. అమ్మకోసం ఎదురు చూసి నేను ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నా. రోజు ఏడ్చేవాడిని. చనిపోయే స్టేజ్ కి వచ్చేసాను. నా పరిస్థితి చూసి ఇంట్లో వారు కనక దుర్గమ్మ గుడికి తీసుకెళ్లి ఈవిడే మీ అమ్మ.
అమ్మ బయటకు రాదు..ఇక్కడే ఉంటుంది. అప్పటి నుంచి దుర్గమ్మని అమ్మగా భావించి పెరిగాను' అని బరువెక్కిన హృదయంతో అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రాజేంద్రప్రసాద్ సినిమాల సంగతి చూస్తే.. కృష్ణారామా అనే చిత్రంలో నటించారు. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఇందులో గౌతమీ కీలక పాత్ర పోషించారు.
మదిరాజ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇంకా ఆయన చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లున్నాయి. వాటిని అధికారికంగా కన్పమ్ చేయాల్సి ఉంది.
ఇప్పటివరకూ ఆయన సినిమాలు తప్ప మరో ప్రపంచం వైపు చూడలేదు. మరి నటుడిగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా? అన్నది ఈ మధ్య తెరపైకి వస్తుంది. అయితే దీనిపై ఆయన నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.