లోకేష్ పై సూపర్ స్టార్ కాన్పిడెన్స్ ఈ రేంజ్ లోనా?
ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా గురించి మరిన్ని విషయాలు షేర్ చేసారు. 'ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని లొకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'లియో' తర్వాత లోకేష్ ఆ ప్రాజెక్ట్ పైనే బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ పై తన ఇష్టాన్నంతటిని ఈ సినిమా ద్వారా చూపించ బోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రజనీ సరసన ఏ హీరోయిన్ ఎంపిక చేయాలి? ఎలాంటి నటుల్ని భాగం చేయాలి వంటి అంశాలపై లోకేష్ దృష్టి పెట్టి పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా అప్పుడప్పుడు మీడియా ఇంటర్వ్యూల్లో సైతం ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా గురించి మరిన్ని విషయాలు షేర్ చేసారు. 'ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2024 నాటికి అవి పూర్తవుతాయి. కంప్లీట్ గా యాక్షన్ ఓరియేంటెడ్ సినిమా ఇది. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్ ఇలాంటి సినిమాలో నటిస్తున్నారు.
కథ విన్నాక ఆయన ఎంతో సంతోషించారు. అనిరుద్..నేను కలిసి వెళ్లి కథ చెప్పాం. విన్న వెంటనే పైకెలేచ్చి హత్తుకున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ మూవ్ మెంట్ చాలా సంతోషాన్నిచ్చింది' అని అన్నారు. ఇక తలైవార్ కొన్నాళ్లగా యంగ్ డైరెక్టర్లతో నే ముందుకెళ్తున్నారు. సక్సెస్ ల్లో ఉన్న దర్శకుల్ని వెతికి పట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఈవిషయంలో రజనీకాంత్ చాలా అప్ డేట్ గా ఉన్నారనొచ్చు.
170వ చిత్రాన్ని నెల్సన్ దీలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధించిందో తెలిసిందే. ఈ విజయంతో రజనీకాంత్ ఆర్ధిక సమస్యలు సైతం తీరిపోయాయి. సినిమాకు ముందు తీసుకున్న పారితోషికంతో పాటు అదనంగా మరో 100 కోట్లు అందుకున్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.