ఆ కల తర్వాత నా జీవితం మారిపోయింది : రజినీ

చిన్నతనంలో నేను ఎక్కవగా దేవుడిని నమ్మేవాడిని కాదు, దేవుడిని ఎక్కువగా పూజించేవాడిని కాదు.

Update: 2024-05-09 07:24 GMT

తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధ్యాత్మికంగా ఆయన ఆలోచన తీరును ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. తాజాగా రజినీకాంత్ మరోసారి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఒక చిట్ చాట్ లో రజినీకాంత్‌ తాను హీరో అవ్వక ముందు ఉన్న పరిస్థితులు, ఆ సమయంలో తన యొక్క మెంటల్‌ కండీషన్ గురించి చెప్పుకొచ్చాడు. కండక్టర్ స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగే క్రమంలో తాను దేవుడిపై నమ్మకం పెట్టుకున్నాను, ఆ దేవుడిని నమ్మడం వల్లే నాకు అంతా మంచి జరిగింది అన్నాడు.

చిన్నతనంలో నేను ఎక్కవగా దేవుడిని నమ్మేవాడిని కాదు, దేవుడిని ఎక్కువగా పూజించేవాడిని కాదు. అయితే నేను ధనవంతుడిని అవ్వాలి అని మాత్రం నేను అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి దేనికి కూడా భయపడని నేను ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. కానీ ఆ సమయంలో దేవుడి ఫోటో చూస్తూ పూజించాను. దాంతో నా నిర్ణయం మారిపోయింది.

అదే రాత్రి నాకు కల కూడా వచ్చింది. తెల్లని గడ్డంతో సంతనోర్వా నదికి మరో వైపు ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన నన్ను దగ్గరకు పిలిచినట్టు అనిపించింది. నాకు ఈత రాకున్నా కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆయన వద్దకు చేరుకున్నాను. మరోసటి రోజు ఆ పోలికలను చెబితే అంతా కూడా రాఘవేంద్ర స్వామి అన్నారు.

వెంటనే నేను ఒక మఠానికి వెళ్లి రాఘవేంద్ర స్వామిని ధనవంతుడిని అవ్వాలని కోరుకున్నాను. ప్రతి గురువారం కూడా ఉపవాసం ప్రారంభించాను. కొన్ని రోజులకే నేను కండక్టర్‌ నుంచి ఫిల్మ్‌ స్టార్‌ గా మారిపోయాను. బాలచందర్‌ సార్‌ నన్ను గుర్తించడం మొదలుకుని అన్ని విషయాలు కూడా ఒక మాయలా జరిగి పోయాయి అన్నాడు. మొత్తానికి ఆ కల తర్వాత నా జీవితం పూర్తిగా మారి పోయిందని నేను భావిస్తాను అంటూ రజినీకాంత్‌ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News