తలైవా.. కోలీవుడ్ సోలో కింగ్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎలాంటి స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-08 19:30 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎలాంటి స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెడుతూనే ఉన్నారు. ఏడు పదుల వయసులో కూడా ఫుల్ జోష్ తో వర్క్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో షాక్ ఇస్తున్నారు. సినీ ప్రియులను ఆకట్టుకోవడమే తన ధ్యేయంగా దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుని సత్తా చాటుతున్నారు రజినీకాంత్.

గత ఏడాది జైలర్ మూవీతో రజినీకాంత్ సూపర్ హిట్ అందుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆ మూవీతో బిగ్గెస్ట్ హిట్ సాధించారు. ఇప్పుడు వేట్టయన్ మూవీతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. విడుదలకు సిద్ధమవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాపై ఫుల్ గా పాజిటివ్ క్రియేట్ అయింది.

మరోవైపు, రజినీకాంత్ చేతిలో కూలీ, జైలర్-2 ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ మూవీ ఇప్పటికే సెట్స్ పై ఉంది. వేట్టయన్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కూలీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు రజినీ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్.. ఫస్ట్ గ్లింప్స్ తో పాటు పలు పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే కూలీ సెట్స్ పై ఉండగానే.. జైలర్-2కు కూడా రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ కన్నా సీక్వెల్ కు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది దసరాకు జైలర్-2ను విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత మణిరత్నంతో రజినీ చేతులు కలపనున్నట్లు వినికిడి. 33 ఏళ్ల తర్వాత వారి కాంబోలో సినిమా తెరకెక్కబోతుందట.

డిసెంబర్ 12వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. అలా రజినీ.. మంచి స్క్రిప్ట్‌ లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. దర్శకులను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. దీంతో తన సూపర్ లైనప్ తో కోలీవుడ్ కింగ్ గా మారిపోయారు! అదే సమయంలో విజయ్ దళపతి తన యాక్టింగ్ కెరీర్ కు మరో మూవీతో ఫుల్ స్టాప్ పెడతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తలైవా సోలో కోలీవుడ్ కింగ్ గా కొన్నేళ్లపాటు ఏలడం ఖాయం!

Tags:    

Similar News