ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గురువు ఈయనే!
వృత్తిలోనే కాదు..వ్యక్తిగతంగానూ గాను రజనీకాంత్ మరో లెజండరీని గురువుగా స్వీకరించారు. ఆయనే బిగ్ బీ అమితాబచ్చన్.
ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్- కమల్ హాసన్ ల గురువు ఎవరు? అంటే లెజెండరీ డైరెక్టర్ బాల చందర్ పేరుచెబుతారు. ఇరువురు అంత పెద్ద స్టార్లగా ఎదిగారంటే? కారణం బాలచందర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాల చందర్ సినిమాలోతనే ఇద్దరు వెలుగులోకి వచ్చారు. నటనలో వాళ్లిద్దరు గురువు బాల చందర్. అయితే రజనీకాంత్ కి మరో గురువు కూడా ఉన్నారు? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వృత్తిలోనే కాదు..వ్యక్తిగతంగానూ గాను రజనీకాంత్ మరో లెజండరీని గురువుగా స్వీకరించారు. ఆయనే బిగ్ బీ అమితాబచ్చన్. అవును ఈ విషయం స్వయంగా రజనీకాంత్ ఓ వేడుక సందర్భంగా తెలిపారు. వృత్తిగతంగానూ ..వ్యక్తిగతంగానూ రజనీకాంత్ తన గురువుగా అమితాబ్ పేరును చెప్పడం విశేషం. 'వెట్టేయాన్' ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సంగతి చెప్పారు. రజనీకాంత్ హీరోగా జ్ఞాన్ వేల్ తెరకెక్కించిన సినిమా ఇది.
ఇందులో అమితాబచ్చన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో అమితాబచ్చన్ నటిస్తానని ఒప్పుకున్నప్పుడు నాకెంతో సంతోషంగా కలిగింది. నా లో తెలియని ఉత్సాహం మొదలైంది. ఇంతవరకూ ఎన్నో సినిమాలుచేసాను. కానీ అమితాబ్ తో కలిసి పనిచేస్తున్నాను అనే విషయం నాలో జోష్ ని నింపింది. ఎందుకంటే ఆయన్ని నేను ఓ గురువుగా భావిస్తా. ఆయన నటన అంటే ఎంతో ఇష్టం' అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గామారాయి. ఇంతవరకూ ఈ విషయాన్ని రజనీకాంత్ తన మనసులోనే ఉంచుకున్నారు. తొలిసారి తన మనసులో భాబాల్ని బట్ట పెట్టి అమితాబ్ స్థానాన్ని చెప్పడం విశేషం. ఇక అమితాబ్ ఈ మధ్య సౌత్ సినిమాలు ఎక్కువగా చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవితో 'సైరా నర సింహారెడ్డి'లో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన 'కల్కి 2898'లోనూ నటించారు. తాజాగా 'వెట్టేయాన్' కూడా చేరింది.