కమల్ ట్రాక్ ఎక్కేశారు.. మరి రజనీ పరిస్థితేంటో?
పాన్ ఇండియా ట్రెండ్ రాక ముందే ఈ ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్లో అభిమానుల ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈ అగ్రహీరోల సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు భారీ ఆసక్తి నెలకొంటుంది.
నటన లో సరిహద్దులు చెరిపేసిన స్టార్స్ రజనీకాంత్ - కమల్‌హాసన్. దాదాపు ఐదు దశాబ్దాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని తారలుగా వెలుగొందుతున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ రాక ముందే ఈ ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్లో అభిమానుల ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈ అగ్రహీరోల సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు భారీ ఆసక్తి నెలకొంటుంది. ఎంతో మందికి ఈ ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఒకరేమో తన స్టైల్ అండ్ స్వాగ్తో సినీ ప్రేమికులను ఆకట్టుకుంటే.. మరొకరేమో భిన్నమైన పాత్రలు చేస్తూ మల్టీ టాలెంటెడ్‌గా క్రేజ్ దక్కించుకున్నారు.
వీరిద్దరి సినిమాలు అన్నీ భాషలతో పాటు తెలుగు లోనూ రిలీజై ఆకట్టుకుంటుంటాయి. కానీ తెలుగులో వీరిద్దరికి చాలా కాలంగా సరైన గట్టి హిట్ లేక సతమతమయ్యారు. అయితే కమల్ రీసెంట్గా విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. అంతకుముందు ఎప్పుడో 2013లో విశ్వరూపంతో హిట్ అందుకున్నారు. ఈ సినిమా అభిమానులు బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఉత్తమ విలన్, చీకటి రాజ్యం వంటి సినిమాలు బోల్తా కొట్టాయి. ఒక్క పాపనాశం మాత్రమే హిట్ అయింది. ఆ సక్సెస్ కూడా కోలీవుడ్ వరకే పరిమితమైంది.
అలాంటి సమయంలో ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాతో వచ్చి పాన్ ఇండియా స్థాయి లో భారీ బ్లాక్ బాస్టర్‌ను అందుకున్నారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.500కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన నాలుగు చిత్రాల వరకు లైన్లో పెట్టారు. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఇండియన్ 2, ప్రభాస్‌తో కల్కి, యాక్షన్ డైరెక్టర్ హెచ్ వినోద్‌తో ఓ సినిమా, మణిరత్నంతో మరో చిత్రాన్ని చేస్తున్నారు.
కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇంకా సరైన హిట్ లేక ఆయన అభిమానులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తెలుగులో ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. గత 20ఏళ్లలో చంద్రముఖి, శివాజి ది బాస్, రోబో వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ ఆయన చివరిసారిగా విజయాన్ని అందుకుంది 2010లో రోబో తోనే. ఆ తర్వాత తెలుగు లో ఒక్క హిట్ కూడా దక్కలేదు. కొచ్చాడియన్, కబాలి, లింగ, కాలా, రోబో 2.0, పేటా, దర్బాల్, అన్నాత్తే అన్ని కమర్షియల్ గా ఓకే అనిపించినప్పటికీ ఆయన రేంజ్ కు తగ్గట్టు భారీ హిట్ దక్కలేదు.
ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా కథ చూస్తుంటే కమల్ 'విక్రమ్' స్టైల్లో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాతో రజినీ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కమల్‌కు 'విక్రమ్' ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో రజనీకి కూడా 'జైలర్' అలాగే టర్నింగ్ పాయింట్ అవుతుందని గట్టిగా భావిస్తున్నారు. ఆగస్ట్ 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.