ఈ వీకెండ్ కూడా జైలర్ దేనా?
దీంతో మళ్ళీ జైలర్ సినిమా షోలకి బుకింగ్స్ పెరిగాయని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి బుకింగ్స్ అద్భుతంగా జరిగాయని టాక్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే కోలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని అధికమించి జైలర్ మొదటి స్థానంలో ఉన్న సూపర్ స్టార్ రోబో 2.ఓని అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఒక ఒక మామూలు స్టోరీని ఎక్ట్రార్డినరీగా సిల్వర్ స్క్రీన్ పై నెల్సన్ దిలీప్ ఆవిష్కరించడం, దానికి అదిరిపోయే లెవల్ లో బీజీఎం సెట్ కావడం ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. 500 కోట్ల కలెక్షన్స్ ని ఇప్పటికే జైలర్ మూవీ క్రాస్ చేసేసింది. ఈ వీకెండ్ లో తెలుగులో రిలీజ్ అయినా గాండీవదారి అర్జున, బెదుర్లంక సినిమాలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.
దీంతో మళ్ళీ జైలర్ సినిమా షోలకి బుకింగ్స్ పెరిగాయని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి బుకింగ్స్ అద్భుతంగా జరిగాయని టాక్. తమిళ్ లో కూడా ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ లేవు. దీంతో శని, ఆదివారాలు జైలర్ జోరు చూపించే అవకాశం ఉందనే టాక్ సినీ పండితుల నుంచి వినిపిస్తోంది. లాంగ్ రన్ లో మెజారిటీ ఆడియన్స్ జైలర్ మూవీని చూసేసారు.
ఇంకా ప్రేక్షకాదరణ ఉంటే ఈ వారాంతానికి 550 కోట్ల వరకు కలెక్షన్స్ రీచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. గట్టిగా ట్రై చేస్తే ఈ చిత్రం 600 కోట్ల వరకు లాంగ్ రన్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎంతో కాలంగా ఆకలితో ఉన్న సూపర్ స్టార్ అభిమానులకి జైలర్ సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇచ్చింది. ఇలాంటి కథలు పడితే రజినీకాంత్ స్టార్ డమ్ ఏంటనేది అందరికి తెలుస్తుందని అంటున్నారు.
తమిళ్ లో అయితే ఇప్పటికే రోబో 2.0 కలెక్షన్స్ రికార్డుని కూడా అందుకుందని తెలుస్తోంది. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నెక్స్ట్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతోంది. శర్వానంద్, అమితాబచ్చన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ కి మూవీ కోసం ఎంపిక చేశారు.