అమెరికాలో అజిత్ - విజ‌య్ రికార్డులకు ర‌జ‌నీ చెక్

ఈ చిత్రం USA డిస్ట్రిబ్యూటర్ అధికారిక వివ‌రాల ప్ర‌కారం బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది.

Update: 2023-08-11 17:05 GMT

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా స్టైల్‌గా టేకాఫ్ అయ్యింది. ఆహ్లాదకరమైన సమీక్షలతో 'జైలర్' మునుముందు గొప్ప వసూళ్లను రాబట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో జైలర్ USA బాక్సాఫీస్ కలెక్షన్ ల గురించి అప్ డేట్ అందింది. ఉత్త‌ర అమెరికాలో ఈ చిత్రం 1.5 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా వసూలు చేసిందనేది తాజా రిపోర్ట్.

ఈ చిత్రం అమెరికా ప్రీమియర్ ల‌ నుండి దాదాపు 920K డాల‌ర్లు సంపాదించింది. 1.5 మిలియన్ డాల‌ర్ల‌తో 1వ రోజు ముగిసింది. ఈ చిత్రం USA డిస్ట్రిబ్యూటర్ అధికారిక వివ‌రాల ప్ర‌కారం బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. 1.5 మిలియన్ల డాల‌ర్ల‌ మార్కును అధిగమించడం ద్వారా USAలో గత పొంగల్ విడుదలైన ద‌ళ‌ప‌తి విజయ్ 'వరిసు' ($1.14 మిలియన్లు) .. త‌ళా అజిత్ 'తునీవు' ($880K) జీవితకాల బాక్సాఫీస్ కలెక్షన్‌లను 'జైలర్' అధిగమించింది. రజనీకాంత్ అసాధార‌ణ న‌టుడు.. అత‌డు మ‌రోసారి త‌న స‌త్తాని చాటారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బాక్సాఫీస్‌ని ఎలా శాసిస్తున్నారో మరోసారి నిరూపించారు అని విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా అవతరించేందుకు 'జైలర్' 4.5 మిలియన్ డాల‌ర్ల (38కోట్లు) కంటే ఎక్కువ సంపాదించాలి. జైల‌ర్ తో ఈ ఫీట్ సులువుగా సాధ్య‌మ‌య్యేలా కనిపిస్తోంద‌ని అమెరికా ట్రేడ్ చెబుతోంది.

'జైలర్' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 72 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ప్రత్యేక మార్నింగ్ షోలు లేకుండా తమిళనాడులో రూ.24 కోట్లు వసూలు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి రోజు 5 కోట్లు వ‌సూలైంద‌ని క‌థ‌నాలొచ్చాయి. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్‌ని అభిమానులు ఊహించిన విధంగా సరికొత్తగా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యార‌ని ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన వివ‌రాల ప్ర‌కారం... జైల‌ర్ దెబ్బ‌కు అమెరికాలో అజిత్-విజ‌య్ రికార్డులు తుత్తునియ‌లు అయ్యాయ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News