రజనీ-షారుఖ్ స్టామినా.. పదేళ్ల లెక్క దెబ్బకు స్మాష్
గత కొంత కాలంగా వరుస ఫ్లాప్ లతో సతమైన ఈ ఇద్దరు బడా స్టార్స్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తమ కొత్త చిత్రాలతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు.
ఇండియన్ సినిమాలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఈ ఏడాది రెండే పేర్లే సంచలనాలు సృష్టించాయి. అవే సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ ఖాన్ షారుక్. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్ లతో సతమైన ఈ ఇద్దరు బడా స్టార్స్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తమ కొత్త చిత్రాలతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ ను వందల కోట్ల వసూళ్లతో షేక్ చేసేశారు.
వివరాళ్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ వరల్డ వైడ్ గా తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులోనుూ ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక బస్టర్ హిట్గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను అందుకున్నాయి. గత 20 ఏళ్ల కాలలో చంద్రముఖి, శివాజి ది బాస్, రోబో వంటి చిత్రాలతో బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాసి సరికొత్త రికార్డులు సృష్టించారు.
అయితే ఆయన చివరిసారిగా విజయాన్ని అందుకుంది 2010లో రోబోతోనే. ఆ తర్వాత ఒక్క సరైన హిట్ కూడా ఆయన ఖాతాలో పడలేదు. కొచ్చాడియన్, కబాలి, లింగ, కాలా, రోబో 2.0, పేటా, దర్బాల్, అన్నాత్తే.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. అవన్నీ భారీ డిజాస్టర్లు లేదా పర్వాలేదనిపించాయే తప్ప.. ఆయన రేంజ్ కు తగ్గట్టు భారీ సక్సెస్ ను అందించలేదు. ఇక రజనీ కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆ అంచనాలను ఇప్పుడు వచ్చిన జైలర్ తారుమారు చేసింది. రజనీ స్టార్ డమ్ ఏంటో నిరూపించింది. వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ టైమ్ లో ఏకంగా రూ.650కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది.
ఇక షారుక్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు జవాన్ చిత్రంతో తన స్టామినో ఏంటో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నారు. నిజానికి గత దశాబ్ద కాలంలో షారుక్ కూడా తన స్టార్ స్టేటస్ కు తగ్గట్టు ఒక్క సక్సెస్ ను చూడలేదు. 2013లో చెన్నై ఎక్స్ ప్రెస్ తో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత దిల్ వాలే, ఫ్యాన్, రేస్ ఇంకా ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. 2018లో వచ్చిన జీరో సినిమా అయితే ఫుల్ రన్ టైమ్ లో రూ.100కోట్లను కూడా అందుకోలేక చతికిలపడింది. దీంతో షారుక్ ఐదేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కేవలం కథలపైనే ఫోకస్ పెట్టి ముూడు చిత్రాలు ఓకే చేశారు. అవే పఠాన్, జవాన్, డంకీ.
వాటిలో ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ తో రూ.1000కోట్ల బ్లాక్ బస్టర్ అందుకుని అభిమానులకు ఊహించని రేంజ్ లో ట్రీట్ ఇచ్చారు. మళ్లీ ఏడు నెలల గ్యాప్ లోనే 'జవాన్' విజయంతో బాక్సాఫీస్ పీటాన్నే కుదిపేశారు. ఈ చిత్రం ఇప్పుటికే మూడు రోజుల్లో రూ.300కోట్లకు పైగా వసూలు చేసిందని అంటున్నారు. లాంగ్ రన్ లో సినిమా అన్ని రికార్డులను చెరిపేస్తుందని, రూ.1000కోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తనను కింగ్ ఖాన్ అని ఎందుకు అంటారో ఈ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో నిరూపించారు షారుక్. ఇక మిగిలిందల్లా డంకీ చిత్రం మాత్రం. మరి ఈ చిత్రం ఎలాంటి కథతో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలాంటి రిజల్ట్ అందుకుందో చూడాలి.. మొత్తంగా రజనీ-షారుక్ కు ఈ ఏడాది 2023 బాగా కలిసొచ్చింది. తమ చిత్రాలతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చి రికార్డులు సృష్టించారు.