కమల్ హాసన్ బ్యానర్ పై తప్పుడు ప్రచారం!
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పేరు వినియోగించుకుని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వనటుడు కమల్ హాసన్ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. `విక్రమ్` సక్సెస్ తర్వాత కమల్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తాను హీరోగా చేస్తోన్న ప్రాజెక్ట్ లతో పాటు సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ బ్యానర్ పై నిర్మించబోయే చిత్రాల్ని సైతం ప్రకటించి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. హీరో పాత్రల తో పాటు ఇతర హీరోల చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించడానికి కమల్ దూసుకొస్తున్నారు.
కమల్ స్పీడప్ ఇప్పుడు మాములుగా లేదన చెప్పాలి. అయితే ఇదే అదునుగా కొందరు కమల్ బ్యానర్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పేరు వినియోగించుకుని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ సంస్థ పేరుపై క్యాస్టింగ్స్ ఏజెంట్స్ ని నియమించినట్లు..వారి ద్వారానే రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బ్యానర్ పేరుతో చాలా మంది ఈమెయిల్స్...ఫోనెనెంబర్లకు మెసెజ్ లు ..వాట్సాప్ సందేశాలు వెళ్తున్నాయి.
అయితే వీటిని కమల్ ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని..ఎవరో తమ సంస్థ పేరుతో ఎన్ క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఇలాంటి పనులకు తెగబడుతున్నారని వివరణ ఇచ్చారు. తమ బ్యానర్ పేరుతో వస్తోన్న వాటిపై ఎవరూ స్పందించవద్దని....వాటిని నమ్మొద్దని వెల్లడించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా తామే వెల్లడిస్తామని తెలిపారు.
సోషల్ మీడియాలో ఇలాంటి సందేశాలు సహజమే. అగ్ర బ్యానర్ల పేరుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతుంటాయి. అయితే వాటి పట్ల ఆకర్షితులు జాగ్రత్తగా లేకపోతే గనుక నిండా ముంచేస్తారు. అవకాశాలు కల్పిస్తామని డబ్బులు తీసుకుని చేతులెత్తేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.
బ్యానర్ పేరును వినియోగించు కుని మోసం చేసన వారెంతో మంది. అందుకే ఔత్సాహికులు ఎవరైనా అధికారిక ఆఫీస్ ద్వారానే అసలు విషయాన్ని గ్రహించాలని నిర్మాణ సంస్థలు చెబుతుంటాయి. టాలీవుడ్ లోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా సందర్భాల్లో జరిగాయి. మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు.