అదే స్టైల్​.. అదే స్వాగ్.. పవర్​ ప్యాక్డ్​గా రజనీ 'జైలర్' ట్రైలర్​

కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు"అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ ​ వచ్చిన డైలాగ్​తో రజనీ క్యారెక్ట రైజేషన్​ను బాగా ఎలివేట్ చేశారు.

Update: 2023-08-02 14:48 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్‌ 'జైలర్‌' ట్రైలర్ వచ్చేసింది. సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్​ కానున్న సందర్భంగా మూవీటీమ్​ షోకేస్ పేరుతో ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​ యాక్షన్‌ సన్నివేశాలతో అదిరిపోయింది. సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ ప్రచార చిత్రంలో ఎప్పటిలాగే రజనీకాంత్ తన పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీతో కనిపించారు. ముఖ్యంగా యాక్షన్​ విజువల్స్.. సీట్ ఎడ్జ్ థ్రిల్​ను అందిస్తూ క్యురియాసిటీని ఫుల్​గా పెంచిసేంది. "ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు"అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ ​ వచ్చిన డైలాగ్​తో రజనీ క్యారెక్ట రైజేషన్​ను బాగా ఎలివేట్ చేశారు.

రజనీ మొదట.. తన పోలీస్ కొడుకు, స్కూలు మనవడు షూ పాలీష్ చేస్తూ కనిపించారు. కానీ ఆ తర్వాత.. "ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే" అంటూ రజనీ యాక్షన్ మోడ్‍లో మైండ్​ బ్లో చేసే విధంగా అనిపించింది.

చివర్లో 'టైగర్‌గా హుకుం' అంటూ రజినీ చెప్పిన డైలాగ్​ హైలైట్​గా ఉంది. అయితే ఈ రజనీ సన్నివేశాలన్నింటికీ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బ్రిలియంట్​గా ఉంది. రజనీ పాత్రను మరింత బాగా ఎలివేట్​ చేశారు.

మొత్తంగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. రజనీ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేసి చూపించారు. ఇంకా తన మార్క్ ఫన్​కు కూడా కాస్త చూపించారు. జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ చిన్న షాట్స్​ సింపుల్ డైలాగ్స్​ బాగున్నాయి. ఇందులో సునీల్​.. ఇన్​కమ్​ ట్యాక్స్​ ఆఫీసర్స్​ వచ్చినప్పుడు.. ఏమైనా డొనేషన్స్​ కావాలా అంటూ నవ్వించారు.

ఇంకా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్​గా నటించింది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సన్​ పిక్చర్స్​ సినిమాను నిర్మించింది. రీసెంట్​గా విడుదలైన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన పాట​ సోషల్​మీడియాలో సెన్సేషన్ క్రియేట్​ చేసింది.


Full View


Tags:    

Similar News