.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

పిక్ టాక్‌ : వేట్టైయన్ ను కలిసిన సేనాపతి

భారతీయుడు 2 స్టార్‌ సేనాపతితో వెట్టైయన్‌ స్టార్‌ రజినీకాంత్‌ కలిసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Update: 2024-06-29 07:38 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్‌ 2 సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించారు. అయిదు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఇండియన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.

 

తెలుగు లో భారతీయుడు 2 టైటిల్‌ తో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా కమల్‌ హాసన్, సిద్దార్థ్‌, శంకర్ లు చక్కర్లు కొడుతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెల్సిందే.

ప్రమోషన్ లో భాగంగా లైకా ప్రొడక్షన్స్ వారు ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. భారతీయుడు 2 స్టార్‌ సేనాపతితో వెట్టైయన్‌ స్టార్‌ రజినీకాంత్‌ కలిసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండియన్ 2 మరియు వెట్టైయన్‌ సినిమాలను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

అందుకే లైకా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సుందర్ రాజన్‌ ఇద్దరు సూపర్‌ స్టార్స్ తో కలిసి ఫోటో దిగాడు. ఇద్దరు బిగ్గెస్ట్‌ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్‌ లో చూడటంతో ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబోలో ఒక సినిమా ను తీయాలని కూడా ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుందర్ రాజన్‌ కి నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. రజినీకాంత్‌ వెట్టైయన్‌ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News