రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు

అలాగే ప్రతిరోజు రాజ్ తరుణ్ కి సంబందించిన మనుషులు ఫోన్ చేసి, మెసేజ్ లు చేస్తూ బెదిరింపులకి పాల్పడుతున్నారని లావణ్య ఆరోపించింది.

Update: 2024-07-16 06:20 GMT

యంగ్ హీరో తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదంలో పోలీసులు రంగంలోకి దిగారు. పెళ్లి పేరుతో సహజీవనం చేసి ఇప్పుడు మాల్వీ మాల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేసింది. దీనిపై లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర న్యాయపరంగా ఆమె తరపున ఫైట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు రాజ్ తరుణ్ కి సంబందించిన మనుషులు ఫోన్ చేసి, మెసేజ్ లు చేస్తూ బెదిరింపులకి పాల్పడుతున్నారని లావణ్య ఆరోపించింది.

అలాగే అతనితో రిలేషన్ లో ఉన్నానని సాక్ష్యాధారాలు లావణ్య పోలీసులకి సమర్పించింది. ఈ వ్యవహారంలో లావణ్య ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో బ్రతికి బయటపడింది. అయితే లావణ్య రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె తమ్ముడు మయాంక్ మీద ఫిర్యాదు చేసింది. లావణ్య సమర్పించిన సాక్ష్యాధారాలని బేస్ చేసుకొని ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు జారీ చేశారు. BNSS 45 క్రింద రాజ్ తరుణ్ కి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.

ఈ నెల 18లోపు నోటీసులకి సమాధానం చెప్పాలని పోలీసులు రాజ్ తరుణ్ కి ఆదేశాలు జారీ చేశారు. లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసిన మొదటి రోజు రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చారు. లావణ్య మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డ్రగ్స్ కి బానిసయ్యిందని ఆరోపించారు. అలాగే మస్తాన్ సాయి అనేవాడికి లావణ్యకి ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ అన్నారు. అలాగే డబ్బు కోసమే లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

అయితే తరువాత లావణ్య లీగల్ గా సాక్ష్యాలు సేకరించి పోలీసులకి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ బయటకి రాలేదు. మీడియా కూడా అతని సమాధానం కోసం ఎదురుచూస్తోంది. లావణ్య రెగ్యులర్ గా మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ కి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని ఆరోపిస్తోంది. అలాగే మాల్వీ మల్హోత్రా మీద సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉంటే పోలీసులు నోటీసులు ఇవ్వడంతో రాజ్ తరుణ్ కచ్చితంగా బయటకొచ్చి అన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీడియా ఫోకస్ కచ్చితంగా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలకి మీడియా ద్వారా రాజ్ తరుణ్ ఏమైనా వివరణ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News