డ్రగ్స్ తీసుకొని నన్ను వేధించేది - రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-06 04:07 GMT

రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ళు తనతో సహజీవనం చేసి ప్రస్తుతం ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని వదిలేశాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అలాగే రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్, ఆమె అన్నయ్యపైన లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. తనకి వారితో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కావాలని నన్ను డ్రగ్స్ కేసులో కూడా గతంలో ఇరికించారని లావణ్య తెలియజేసింది.

ఇదిలా ఉంటే ఈ న్యూస్ టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడర సామి రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో ప్రియురాలు రోడ్డు మీదకి వచ్చి అతనిపై ఆరోపణలు చేయడం, ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ఇష్యూపైన రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు. గతంలో లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని పేర్కొన్నాడు.

అయితే ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే చెడు స్నేహాల కారణంగా తాను దూరమయ్యానని, నా ముందు లావణ్య చాలా సార్లు డ్రగ్స్ తీసుకుందని రాజ్ తరుణ్ తెలిపారు. డ్రగ్స్ తీసుకొని నన్ను టార్చర్ చేస్తూ ఉండేదని, ఎప్పటికప్పుడు డబ్బులు కావాలని డిమాండ్ చేసేదని రాజ్ తరుణ్ లావణ్యపై ఆరోపణలు చేశారు. నా ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో అని భయపడి ఇన్ని రోజులు ఆమె ఎన్ని వేధింపులకి గురిచేసిన సైలెంట్ గా ఉన్నానని అన్నారు.

పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశానని, గుడిలో పెళ్లి చేసుకున్నాం అని ఆమె ఒక్కోమాట చెబుతుందని అవన్నీ అబద్ధాలే అని రాజ్ తరుణ్ తెలిపారు. ఆమె డ్రగ్స్ కేసులో పట్టుబడటమే కాకుండా మస్తాన్ రిలేషన్ షిప్ లో కూడా ఉందని, అతను తనని పెళ్లి చేసుకోవడం లేదని గతంలో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. ఆమెపై కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అన్ని వివరాలని మరల తెలియజేస్తానని క్లారిటీ ఇచ్చాడు.

లీగల్ గా నా వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటానని రాజ్ తరుణ్ మీడియాతో తెలిపారు. నా కెరియర్ ని దెబ్బతీయడానికి ఆమె ఇలా అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేసిందని, వాటిని నేను ఎదుర్కోవడానికి చట్టపరంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రాజ్ తరుణ్ తెలియజేసారు.

https://www.facebook.com/watch/?v=1220421352729023&rdid=rj8l1Hg73FktTALx

Tags:    

Similar News