పిక్‌టాక్ : చిల్లింగ్‌ మూడ్‌లో అందాల రకుల్‌

మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో టాలీవుడ్‌లో 'కెరటం' సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకుంది.;

Update: 2025-03-20 16:30 GMT

కన్నడ మూవీ గిల్లితో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో టాలీవుడ్‌లో 'కెరటం' సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్‌లో మొదటి సినిమా నిరాశ పరచడంతో తదుపరి ఆఫర్‌ కోసం రెండేళ్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. 2013లో సందీప్ కిషన్‌కి జోడీగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యత లభించింది, పాత్రకు తగ్గట్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ తన నటనతో మెప్పించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

టాలీవుడ్‌లో దాదాపు పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాలు చేసింది. టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లోనూ రకుల్‌ ప్రీత్‌ సింగ్ నటించిన విషయం తెల్సిందే. తెలుగులో ఈ అమ్మడు దశాబ్ద కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేసింది. కానీ గత కొన్నాళ్లుగా ఈమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు కనిపించడం లేదు. టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కని సమయంలో బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. అక్కడ ఒకే సారి అర డజను సినిమాలు చేయడంతో బిజీ హీరోయిన్‌గా మారింది. కానీ ఆ అరడజను సినిమాల్లో ఒక్కటి కూడా రకుల్‌ కి హిట్‌ తెచ్చి పెట్టలేదు.

సినిమాలతో బిజీగా లేని ఈ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా మరో ఫోటో షూట్‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఇటీవల రకుల్‌ భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే. వివాహ వార్షికోత్సవం సందర్భంగా విదేశాల్లో హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసిన రకుల్‌, జాకీ భగ్నాని సోషల్‌ మీడియాలో పలు ఫోటోలను షేర్‌ చేశారు. అందులో భాగంగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రకుల్‌ చాలా సంతోషంగా, చిల్లింగ్‌ మూడ్‌తో చిరు మందహాసంతో కనిపిస్తూ చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ఏడాదిలో మేరి హస్బెండ్‌కి బివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా ఈమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ 'దే దే ప్యార్‌ దే 2' పై ఈమె ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. ఈ సీక్వెల్‌తో పాటు మరో హిందీ సినిమాలోనూ ఈమె ఎంపిక అయింది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండియన్‌ 3 లోనూ ఈమె కీలక పాత్రలో కనిపించబోతుంది అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలు కొన్నే కావడంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆమె ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతోంది. రకుల్‌ మాత్రం చాలా నమ్మకంతో కెరీర్‌లో ముందుకు సాగుతుంది.

Tags:    

Similar News